Chitram Movie Sequel: ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ.. త్వరలోనే సెట్స్ పైకి..
సినీ పరిశ్రమలో కెమెరా మెన్‌గా కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం టాప్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు తేజ. డైరెక్టర్‌గా తీసిన మొదటి సినిమా 'చిత్రం'తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ద్వారా
సినీ పరిశ్రమలో కెమెరా మెన్‌గా కెరీర్ ప్రారంభించి.. ప్రస్తుతం టాప్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు తేజ. డైరెక్టర్‌గా తీసిన మొదటి సినిమా ‘చిత్రం’తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ద్వారా దివంగత హీరో ఉదయ్ కిరణ్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు తేజ. ఉదయ్ కిరణ్‌ను మాత్రమే కాకుండా రీమా సేన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి వంటి నటీనటులతోపాటు ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులను కూడా ఇండస్డ్రీకి పరిచయం చేశాడు. ఇక చివరిగా రానాతో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో మంచి హిట్ కొట్టారు తేజ. ఆ తర్వాత బెల్లం కొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా సీత సినిమాను తెరకెక్కించిన ఆశించనంత విజయం సాధించలేదు.
గతంలో రానాతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించాడు తేజ. తాజాగా తన బర్త్ డే (ఫిబ్రవరి 22న) సందర్భంగా చిత్రం సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. ‘చిత్రం 1.1’ పేరుతో ఆ సినిమా రూపొందించనున్నట్లు.. అంతేకాకుండా ఆ సినిమాను ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకురానున్నట్లుగా ట్వీట్ చేశాడు. అయితే చిత్రం సినిమాకు సంగీతాన్ని అందించిన ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు కూడా మరోసారి సంగీతాన్ని అందించనున్నాడు. అయితే నటీనటులు ఎవరనేది మాత్రం తెలియజేయలేదు. 2000 జూన్ 16న చిన్న సినిమాగా వచ్చిన చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో ఉదయ్ కిరణ్, రీమాసేన్, ఆర్.పి.పట్నాయక్, రసూల్ ఎల్లోర్ వంటి నటీనటులు పరిచయమయ్యారు.
Will start shoot this Year! pic.twitter.com/VHVIJEJ2PT
— Teja (@tejagaru) February 22, 2021
Also Read: