
తెలుగు సినిమా హీరోలతో పాటు దర్శకులు కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హీరోల సంగతి పక్కన పెడితే రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక పుష్ప 2 సినిమాతో సుకుమార్ కూడా వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. వీరి విజయానికి కారణం సినిమా మేకింగ్ లో కాంప్రమైజ్ కాకపోవడమేనని తెలుస్తోంది. సుకుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సినిమా ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. సుకుమార్ భార్య బబిత నిర్మాతగా సత్తా చాటుతుంటే, కూతురు సుకృతి వేణి నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు( చిత్రం జనవరి 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం (జనవరి 17) చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశానికి సుకుమార్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతి వేణి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
మీ నాన్నగారి సినిమాల్లో ఎందుకు నటించలేదు? అని ఒక విలేకరి సుకుమార్ కూతురిని అడిగాడు. దీనికి సుకృతి ఇలా సమాధానమిచ్చింది. ‘ నేను పుష్పలో, పుష్ప 2లో నటిస్తానని నాన్నను అడిగాను. ఎందుకంటే మా టీచర్స్, ఫ్రెండ్స్, నాకు తెలిసినవాళ్లు అందరూ నువ్వు పుష్పలో యాక్ట్ చేస్తున్నావా అని అడిగేవారు. దానికి నాకే చేయాలని అనిపించలేదని చెప్పేదాన్ని. ఇంకొందరు నేను చిన్నపిల్లను కదా అందుకే యాక్ట్ చేయలేదని అనుకున్నారు. కానీ నిజంగా జరిగింది అది కాదు. ‘పుష్ప’, ‘పుష్ప 2′ సినిమాల్లో పాత్ర కోసం అడిగాను. కానీ మా నాన్న నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. బదులుగా నన్ను ఆడిషన్‌కు రమ్మన్నారు’ అని అసలు విషయం చెప్పుకొచ్చింది సుకృతి. దీంతో సొంత కూతురికి కూడా ఒక రోల్ ఇవ్వాలంటే ఆడిషన్ పెట్టే తండ్రి సుకుమార్ గ్రేట్ అన్న కాంప్లిమెంట్స వినిపిస్తున్నాయి.
గాంధీ తాత చెట్టు’ సినిమా ఓ స్కూల్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఓ అమ్మాయి మొక్కను కాపాడే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు ఈ సినిమాను నిర్మించారు. జనవరి 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.