SS Rajamouli: అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న రాజమౌళి.. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన జక్కన్న..
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ అందుకున్నారు రాజమౌళి. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా జక్కన్న పాల్గొని ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు డైరెక్టర్ రాజమౌళి. తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఈ సినిమాతో ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు జక్కన్న. తాజాగా మరో అరుదైన గౌరవం పొందారు. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ అందుకున్నారు రాజమౌళి. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా జక్కన్న పాల్గొని ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం సినీ ప్రియులకు.. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ” ట్రిపుల్ ఆర్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేదికపై అందరి ముందు మాట్లాడడం కాస్త కంగారుగానే అనిపిస్తుంది. సినిమా అంటే ఓ దేవాలయం. చిన్నప్పుడు థియేటర్లో సినిమా చూసేందుకు వెల్లినప్పుడు పొందిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది. థియేటర్లో ఈ సీన్ ఎలా ఉంటుంది అని ఓ ప్రేక్షకుడిగా ఊహించుకుని.. తర్వాత సీన్ చిత్రీకరిస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకట్టుకోవడం కోసం సినిమాలు చేస్తుంటారు. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రానికి వచ్చేసరికి విదేశీయులను కూడా ఆకట్టుకుంది.
ఈ సినిమాపై ప్రపంచం మొత్తం అభిమానం చూపించింది. న్యూయార్క్, చికాగోకు వెళ్లినప్పుడు ప్రేక్షకుల ఆనందాన్ని చూశాను. నా సినిమాలకు పనిచేసే ముఖ్యమైన వ్యక్తులందరూ నా కుటుంబసభ్యులే. నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు రాస్తుంటారు. పెద్ద అన్యయ్య ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా.. నా భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా.. నా తనయుడు కార్తికేయ.. వదిన వల్లి లైవ్ ప్రొడ్యూసర్లుగా… సోదరుడి కుమారుడు కాలభైరవ గాయకుడిగా.. మరో సోదరుడు రచయితగా ఇలా వీళ్లంత నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రామ్ చరణ్, ఎన్టీఆర్ కు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు రాజమౌళి.
BEST DIRECTOR! ❤️?❤️?❤️?@ssrajamouli @nyfcc pic.twitter.com/igF8221bqm
— S S Karthikeya (@ssk1122) January 5, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.