Stand Up Rahul: ప్రేమిస్తే వాళ్ల కోసం నిలబడాలి.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..

|

Mar 18, 2022 | 6:32 AM

యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun).. వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు

Stand Up Rahul: ప్రేమిస్తే వాళ్ల కోసం నిలబడాలి.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..
Stand Up Rahul
Follow us on

యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun).. వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. సిద్దు ముద్ద స‌మ‌ర్ప‌కులు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని హోలీ కానుక‌గా ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఇటీవల నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు హీరో వరుణ్ తేజ్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. సిద్దు ఈ క‌థ‌ను శాంటో ద్వారా నాకూ వినిపించారు. ద‌ర్శ‌కుడిలో చాలా క్లారిటీ వుంది. ట్రైల‌ర్‌ లో ఆ విష‌యాన్ని చ‌క్క‌గా చెప్పాడు. నేను, రాజ్ త‌రుణ్ ఒకేసారి కెరీర్‌ను మొద‌లు పెట్టాం. ఇప్ప‌టికీ అలానేవున్నాడు. త‌ను మంచి న‌టుడు. త‌న తొలి సినిమాలా వుంది స్టాండప్ రాహుల్. త‌న క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కుతుంది. వ‌ర్ష మిడిల్‌క్లాస్ మెలోడీస్ చూశాను. త‌న‌కు భ‌విష్య‌త్ వుంది. ఇంద్ర‌జ చ‌క్క‌గా న‌టించారు. కెమెరా విజువ‌ల్స్‌, సంగీతం బాగా ఆక‌ట్టుకున్నాయి. అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ద‌ర్శ‌కుడు శాంటో మాట్లాడుతూ.. మా ఫ్యామిలీకి సినిమారంగంతో అనుభంలేదు. వారు ఇప్పుడు న‌న్ను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇది కామెడీ ఫిలిం అని చేయ‌లేదు. మ‌నం దేన్నైనా స‌రే ఇష్ట‌ప‌డితే ఎవ‌రినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం నిల‌బ‌డాలి, పోరాటం చేయాల‌ని చెప్పే క‌థ ఈ సినిమా. అందుకే స్టాండ‌ప్ కామెడీ నేప‌థ్యాన్ని ఎంచుకున్నా. రాజ్ త‌రుణ్ బాగా స‌హ‌క‌రించారు. నేను అంత‌కుముందు షార్ట్ ఫిలింస్ చేశాను. క‌రోనావ‌ల్ల ఇంకా బాగా రాయ‌డానికి స‌మ‌యం కుదిరింది. వ‌ర్ష మంచి న‌టి. ఈ సినిమాలో చాలా జోక్స్ వ‌ర్ష చెప్పిన‌వే. శ్రీ‌రాజ్ విజువ‌ల్స్ బాగా చూపించాడు. ఇంద్ర‌జ‌తోపాటు అంద‌రూ బాగా న‌టించార‌ని అన్నారు.

Also Read: Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?

HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..