సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది.. కానీ రాజమౌళి నచ్చలేదు అని చెప్పారు

కలర్‌ ఫొటో సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రాజ్. ఇటీవలే సుమ కనకాల కుమారుడితో మోగ్లీ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. అయితే సందీప్ రాజ్ ఈ మధ్యన నటనతో కూడా మెప్పిస్తున్నాడు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్‌ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.

సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది.. కానీ రాజమౌళి నచ్చలేదు అని చెప్పారు
Rajamouli

Updated on: Feb 19, 2026 | 8:51 PM

తెలుగులో తక్కువ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన టేకింగ్ తో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే క్రేజ్ తో 2020లో కలర్ ఫొటో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రాజ్. సుహాస్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ కరోనా కారణంగా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. అయినా సూపర్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా సందీప్ రాజ్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఇదే సినిమాకు గానూ జాతీయ అవార్డును సైతం అందుకున్నాడీ ట్యాలెటెండ్ డైరెక్టర్. దీని తర్వాత పలు సినిమాల్లో సహాయక నటుడు, విలన్ పాత్రలను కూడా పోషించాడు సందీప్ రాజ్.

ఇదేంది మావ..! రాధికా శరత్ కుమార్ చెల్లెలు కూడా హీరోయినా..!! బాలయ్యతో బ్లాక్ బస్టర్స్

ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమాలో సందీప్ పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం మోగ్లీ అనే సినిమాతో మళ్లీ ముందుకు వచ్చాడు సందీప్ రాజ్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే సందీప్ రాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. జాతీయ పురస్కారం పొందిన తర్వాత  సందీప్ రాజ్‌కు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ సలహా ఇచ్చారట. రాజమౌళి తన ఆఫీస్ కు సందీప్‌ను రమ్మని పిలిచారట. రాజమౌళి కలర్ ఫోటో సినిమా గురించి మాట్లాడారని సందీప్ తెలిపాడు. అయితే ఆ సినిమా తనకు నచ్చలేదని, ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయని రాజమౌళి అన్నారట.

ఎలా రా ఇలా.! వైరల్ వీడియో పై సంయుక్త రియాక్షన్.. ఇంతకూ ఆ ఫొటోలో ఉంది ఎవరు.?

సందీప్ రాజ్ ఆ సినిమాను ఎంతో కన్విక్షన్ తో తీశారని, అయితే  హీరో పాత్రతో తాను కనెక్ట్ అయినప్పటికీ, సినిమా ఎండ్ లో నిరాశపరిచిందని రాజమౌళి అన్నారట. ముఖ్యంగా, హీరో చనిపోవడం తనకు నచ్చలేదని అన్నారట. “ఒక కథ ఎప్పుడైనా చావుతో మొదలవ్వాలి గానీ, ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదు” అని రాజమౌళి సందీప్‌కు చెప్పారట. హీరో మరణం కథలో ఎక్కడైనా ఒక మంచి పరిణామానికి దారితీస్తే తప్ప, అది యాక్సెప్టబుల్ కాదని ఆయన అన్నారని సందీప్ రాజ్ తెలిపారు. ఆ రోజు రాజమౌళి ఇచ్చిన ఈ సలహాను సందీప్ రాజ్ ఒక భగవద్గీతగా భావిస్తాను అని తెలిపారు సందీప్ రాజ్.

ఇవి కూడా చదవండి

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us