Saindhav: నోట్లో పెట్టి కాల్చితే అక్కడనుంచి ఎలా బయటకు వచ్చిందన్న..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు వెంకటేష్. ఇక ఈ సంక్రాంతికి సైందవ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా వెంకీ కెరీర్ లో 75వ సినిమా దాంతో ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో వెంకటేష్ సాలిడ్ కొట్టడం ఖాయం గా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను అలరించాయి.

చాలా రోజుల తర్వాత వెంకటేష్ అగ్రసివ్ పాత్రలో కనిపించనున్నాడు. సైందవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వెంకీ . హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు వెంకటేష్. ఇక ఈ సంక్రాంతికి సైందవ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా వెంకీ కెరీర్ లో 75వ సినిమా దాంతో ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో వెంకటేష్ సాలిడ్ కొట్టడం ఖాయం గా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను అలరించాయి. రీసెంట్ గా సైందవ్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు.
ఈ ట్రైలర్ లో ఒక సీన్ లో వెంకటేష్ ఒక వ్యక్తిని నోట్లో గాన్ పెట్టి కాల్చే సీన్ ఉంది. ఈ సీన్ లో వెంకీ ఆ వ్యక్తికి నోట్లో గన్ తో కాల్చితే అతని వెనక భాగం (మలద్వారం)నుంచి బయటకు వచ్చి నట్టు చూపించారు. దాంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్ చేస్తూ.. మీమ్స్ చేస్తున్నారు. తాజాగా ఓ మీమ్ వీడియో పై దర్శకుడు శైలేష్ స్పందించారు.
నోట్లో గన్ పెట్టి కాల్చితే ఆ బుల్లెట్ కడుపులో ఎలా ట్రావెల్ చేసిందో అంటూ ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని పై శైలేష్ స్పందిస్తూ.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. నాకు ఏ విషయానైనా వివరించి చెప్పడానికి ఇష్టపడతా.. మాములుగా నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే ఆ బుల్లెట్ తల వెనుక నుంచి బయటకు రావాలి. కానీ ఆ సన్నివేశంలో ఒక వ్యక్తిని నిర్దిష్ట దిశలో కూర్చోబెట్టి, గన్ ను అతని నోటి లోపలికి పెట్టి మరీ షూట్ చేశాడు. గన్ ను 80 డిగ్రీల కోణంలో కిందకు వంచి కాలిస్తే, బాడీలో ఉన్న అవయవాలను చీల్చుకుంటూ బులెట్ బయటకు వస్తుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే మీరు వీడియోలో చూపించినట్లు బుల్లెట్ మొదట.. శ్వాస కోశం, అన్నవాహిక, కాలేయం, పాంక్రియాస్ తో పాటు కొన్నిసార్లు గుండెకు కూడా తగులుతుంది. ఆ తర్వాత పెద్ద, చిన్న ప్రేగులను చీల్చుకుంటూ.. అదే యాంగిల్ లో శరీరం కిందనుంచి(మలద్వారం) బయటకు వస్తుంది అంటూ వివరించాడు శైలేష్.
Journey of Bullet Ft.#Saindhav 😂 @KolanuSailesh @VenkyMama pic.twitter.com/D5K8pJxAtk
— Hyderabad Hawaaa (@tweetsraww) January 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.