Vyooham: రీల్ జగన్‌తో కలిసి ప్రేక్షకుల మధ్య ‘వ్యూహం’ సినిమా చూసిన ఆర్జీవీ.. ఏమన్నారంటే?

|

Mar 03, 2024 | 6:39 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ నటించగా, వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించింది. రిలీజుకు ముందు ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ పొలిటికల్ డ్రామా ఎట్టకేలకు మార్చి2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Vyooham: రీల్ జగన్‌తో కలిసి ప్రేక్షకుల మధ్య వ్యూహం సినిమా చూసిన ఆర్జీవీ.. ఏమన్నారంటే?
Ram Gopal Varma, Vyuham Movie
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ నటించగా, వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించింది. రిలీజుకు ముందు ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ పొలిటికల్ డ్రామా ఎట్టకేలకు మార్చి2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే ఆదివారం (మార్చి 3) వ్యూహం సినిమాను థియేటర్లలో వీక్షించారు డైరెక్టర్ ఆర్జీవీ. తన సినిమాలో సీఎం జగన్ రోల్ ను పోషించిన అజ్మల్ తో కలిసి విజయవాడ వెళ్లారు వర్మ. అక్కడ జైరామ్ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయలను మీడియాతో పంచుకున్నారు. ‘వ్యూహం సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్సార్ చనిపోయినప్పటి నుంచి జగన్ సీఎం అయ్యేవరకూ అంతా మొదటి భాగంలో ఉంది. సెకండ్ పార్ట్(శపథం) మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది’ అని వర్మ చెప్పారు.

 

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా అజ్మల్ తో కలిసి విమానంలో వెళుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ. విజయవాడలో వ్యూహం సినిమాను చూసేందుకు వెళుతున్నామంటూ తన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు వర్మ. రామధూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ వ్యూహం సినిమాను నిర్మించారు. ధనుంజయ్ ప్రభునే, పద్మావతి, రేఖా నిరోశా తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఆనంద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

హీరో అజ్మల్ తో కలిసి రామ్ గోపాల్ వర్మ..

వ్యూహం సక్సెస్ సెలబ్రేషన్స్..

చేతిలో గన్ తో ఆర్జీవీ..

అమితాబ్ బచ్చన్ తో రామ్ గోపాల్ వర్మ, దాసరి కిరణ్ కుమార్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.