Ram Gopal Varma: అందుకే రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌లో నటించాడేమో? ఆర్జీవీ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్‌

Ranveer Singh: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) న్యూడ్‌ ఫొటోషూట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ మ్యాగజైన్‌ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలు దిగడం, వాటిని అతనే సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరలయ్యాయి. దీనిని కొందరు సమర్థిస్తుంటే

Ram Gopal Varma: అందుకే రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌లో నటించాడేమో? ఆర్జీవీ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్‌
Ram Gopal Varma

Updated on: Jul 26, 2022 | 4:40 PM

Ranveer Singh: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) న్యూడ్‌ ఫొటోషూట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ మ్యాగజైన్‌ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలు దిగడం, వాటిని అతనే సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరలయ్యాయి. దీనిని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను చెడగొడుతున్నాడంటూ ముంబైలో రణ్‌వీర్‌పై రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే విషయమేదైనా తనదైన శైలిలో స్పందించే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లింగ సమానత్వం (Gender Equality) కోసమే అతను ఇలా నూలుపోగు లేకుండా ఫొటోలు దిగి ఉండవచ్చంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు.

‘ నేను పర్సనల్‌గా రణ్‌వీర్‌ చేసిన పనిని అభినందిస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఈ బోల్డ్‌ ఫొటోషూట్‌ను మెచ్చుకోవడం నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. అమ్మాయిలు కూడా ఇలా చేస్తే ఇలానే అభినందిస్తారని నేను అనుకుంటున్నాను. సమానత్వం అనేది అందరికీ ఒకేలా ఉండాలి’ అంటూ రాసుకొచ్చారు ఆర్జీవీ. దీంతో పాటు ఓ పోల్‌ క్వొశ్చన్‌ కూడా పెట్టి స్పందించాలని నెటిజన్లను కోరాడు. కాగా ప్రస్తుతం ఆర్జీవీ పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..