AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2: స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్స్ వద్దంటోన్న RGV.. ట్విట్టర్లో సంచలన కామెంట్స్..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కేజీఎఫ్ 2 ఓ రేంజ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక బాక్సాఫీస్ వద్ద అయితే, భారీ చిత్రాలను కూడా వెనక్కునెట్టుకుంటూ దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌లా మారింది.

KGF Chapter 2: స్టార్ హీరోలకు భారీ రెమ్యునరేషన్స్ వద్దంటోన్న RGV.. ట్విట్టర్లో సంచలన కామెంట్స్..
Rgv
Venkata Chari
|

Updated on: Apr 16, 2022 | 11:26 AM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కేజీఎఫ్ 2(KGF 2) ఓ రేంజ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక బాక్సాఫీస్ వద్ద అయితే, భారీ చిత్రాలను కూడా వెనక్కునెట్టుకుంటూ దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌లా మారింది. అయితే, ఇదే విషయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) కూడా తనదైన శైలిలో కామెంట్లు చేసి, మరింత హీట్ పెంచాడు. పరోక్షంగానే టాలీవుడ్ స్టార్లపై చురకులు కూడా అంటించాడు. ఓవైపు అంతా కేజీఎఫ్ 2 విజయం గురించి ప్రస్తావిస్తుంటే, ఆర్‌జీవీ మాత్రం హీరోల రెమ్యునరేషన్‌పై మాట్లాడాడు. యష్(Yash), ప్రశాంత్ నీల్ కాంబో వచ్చిన ఈ సినిమా.. విడుదలకు ముందే మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇదే నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో వరుస ట్వీట్స్ చేశారు. సినిమా విజయంపై చిత్రయూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. అలాగే డైరెక్లర్ ప్రశాంత్ నీల్‌ను ఆకాశానికెత్తాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్‌ను హీరోల రెమ్యునరేషన్‌తో ముడిపెడుతూ కొన్ని ట్వీట్స్ చేసి, హీట్ పెంచాడు.

స్టార్ హీరోలకు అధికంగా చెల్లించడం దండగని, ఆ డబ్బును సినిమా మేకింగ్‌పై పెడితే, ఇలాంటి సినిమాలే వస్తాయంటూ సరికొత్త వివాదానికి దారి తీశారు. ఇందుకు కేజీఎఫ్ 2 చక్కని ఉదాహరణ అని, మేకింగ్‌లో క్వాలిటీ ఉంటేనే, భారీ విజయాలు వస్తాయని పేర్కొన్నాడు. అంతేకానీ, స్టార్ హీరోలకు భారీగా చెల్లించడం వేస్ట్ అని ట్వీట్ చేశారు.

‘KGF’ వచ్చే వరకు కన్నడ చిత్ర పరిశ్రమను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదని, మొత్తం చిత్ర పరిశ్రమను కేజీఎఫ్2 ప్రపంచ పటంలో ఉంచినందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సాధారణంగా ఆర్‌జీవీ ఏ దర్శకుడిని అంత తేలిగ్గా మెచ్చుకోడు (పూరి జగన్నాధ్ తప్ప). కానీ, ఈసారినీల్‌ని మాత్రం ఆకాశానికి ఎత్తేశాడు. కాగా, కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే చాలా సినిమాలు తక్కువ బడ్జెట్‌లోనే తీస్తుంటారు. కేజీఎఫ్ 2 మాత్రం కోలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రంగా నిలిచింది. ఈక్రమంలోనే ఆర్‌జీవీ టాలీవుడ్ స్టార్ హీరోలపై పరోక్షంగా ట్వీట్ చేసి, ఇండస్ట్రీలో మరింత హీట్ పెంచాడు.

Also Read: KGF 2: కేజీఎఫ్ 2 ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

KGF 2 Day 2 Collections: రాకీభాయ్ దూకుడు మాములుగా లేదుగా.. రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే