Ram Gopal Varma: ‘ఇంత పబ్లిక్‌గా మర్డర్ కాంట్రాక్టులు ఇస్తారా?’ కొలికిపూడి వ్యాఖ్యలపై ఆర్జీవీ ఫిర్యాదు

|

Dec 27, 2023 | 6:25 PM

కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా ఉన్నారు. తనపై బహిరంగంగా ఆరోపణలు చేసిన శ్రీనివాస్‌తో పాటు న్యూస్‌ ఛానెల్‌ యాంకర్‌, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Ram Gopal Varma: ఇంత పబ్లిక్‌గా మర్డర్ కాంట్రాక్టులు ఇస్తారా? కొలికిపూడి వ్యాఖ్యలపై ఆర్జీవీ ఫిర్యాదు
Director Ram Gopal Varma
Follow us on

‘డైరెక్టర్‌ ఆర్జీవీ తల తెస్తే కోటి రూపాయలు’ అంటూ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకుడు కొలికపూడి కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఆర్జీవీ వ్యూహం మూవీపై స్పందిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా ఉన్నారు. తనపై బహిరంగంగా ఆరోపణలు చేసిన శ్రీనివాస్‌తో పాటు న్యూస్‌ ఛానెల్‌ యాంకర్‌, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘టీడీపీ నేత శ్రీనివాస్ లైవ్ లో నన్ను చంపటానికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఒక టీవీ డిబేట్‌లో నన్ను చంపి నా తలను తీసుకువచ్చినవాడికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ ఇచ్చ్చాడు. ఇది కాకుండా నన్ను నా ఇంటి కొచ్చ్చి తగలబెడతానని కూడా పబ్లిక్ గా అదే టీవీలో చెప్పాడు. దీనిని అడ్డుకుంటున్నట్లు నటిస్తూనే యాంకర్‌, మూడు సార్లు నన్ను చంపే కాంట్రాక్ట్‌ శ్రీనివాస రావు తో రిపీట్ చేయించాడు. ఆ తరువాత కూడా శ్రీనివాస రావుతో చర్చ కొనసాగించారు. దీన్ని బట్టి వాళ్లిద్దరూ నన్ను చంపటానికి కాంట్రాక్ట్ ఇవ్వటానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్ గా అర్థమవుతోంది’

ఒక డెమోక్రసీ లొ హత్యా కాంట్రాక్టులు ఇంత పబ్లిక్ గా ఇవ్వటం చూస్తే టెర్రిరిస్టులు కూడా షాక్ అవుతారు. కాబట్టి,పై ముగ్గురి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ కి పిర్యాదు చేశాం. లోకేష్, బాబు జగన్ పై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. సినిమా విమర్శ కాదు. వ్యూహం సినిమాతో టీడీపి భయపడుతుంది. ఇప్పటి వరకు శ్రీనివాస్ కామెంట్లను టీడీపీ ఖండించలేదు. లోకేష్, బాబు ఆలోచన కుడా నన్ను చంపడమే. వ్యూహం సినిమాతో టీడీపీ నేతలు గుమ్మడి కాయల దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు’ అని ఆర్జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదు చేస్తోన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..

ప్రి రిలీజ్ ఈవెంట్ లో వ్యూహం చిత్ర బృందం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.