RRR Movie: ‘ఇది దేశానికి దక్కిన గౌరవం.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై రాజమౌళి..

|

Feb 25, 2023 | 11:13 AM

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్ సీఏ అవార్డు్లలో బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో గెలుపొందింది.

RRR Movie: ఇది దేశానికి దక్కిన గౌరవం.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై రాజమౌళి..
Rajamouli
Follow us on

ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు. భారతీయ సినీ ప్రియులు కాకుండా.. విదేశీయులు సైతం ఈ సినిమాకు ముగ్దులయ్యారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అంతేకాకుండా.. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్.. క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా నాలుగు కేటగిరీల్లోనూ గెలుపొందింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలలో ఈ సినిమా సత్తా చాటింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్ సీఏ అవార్డులలో బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో గెలుపొందింది. మరోసారి విదేశీ చిత్రాలను వెనక్కు నెట్టి అంతర్జాతీయ వేదికపై అవార్డుల ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది.

ఈ అవార్డులను డైరెక్టర్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి అందుకున్నారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ఇది దేశానికి దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆదరించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ చిత్రంలో స్టంట్స్ చేసేందుకు ఎంతో కష్టపడిన నా కొరియోగ్రాఫర్స్ కు ముందుగా థాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం కష్టపడిన స్టంట్ మాస్టర్ జూజీకి థాంక్స్. భారతదేశానికి వచ్చి మా విజన్‌ని అర్థం చేసుకున్న ఇతర కొరియోగ్రాఫర్‌లందరికీ ధన్యవాదాలు. మా వర్కింగ్ స్టైల్‌కు అనుగుణంగా తమ వర్కింగ్ స్టైల్‌ని మార్చుకున్నారు వారు. అందుకే అనుకున్న దానికంటే ఎక్కువగా అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో కేవలం ఒకటి రెండు సీన్లలో మాత్రమే డూప్స్ చేశారు. మిగతా అన్ని యాక్షన్ సన్నివేశాలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేశారు. వారిద్దరూ ఎంతో కష్టపడ్డారు. నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. 320 రోజులు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం. చాలా వరకు ఇందులో స్టంట్స్ ఉంటాయి. ఈ గుర్తింపు నాకు మాత్రమే కాదు.. నా దేశానికి.. అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా. ఈ అవార్డ్ మమ్మల్ని మరింత ప్రొత్సహిస్తుంది. దాదాపు 600 మంది బృందంతో కొన్నిసార్లు 2000 కంటే ఎక్కువమంది ఆర్టిస్టులతో ఈ సినిమాను రూపొందించాం. వారందరికీ ధన్యవాదాలు ” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.