PS Mithran: జర్నలిస్ట్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన స్టార్‌ డైరెక్టర్‌.. సందడి చేసిన హీరో కార్తీ.. ఫొటోలు వైరల్‌

స్టార్‌ డైరెక్టర్ల లిస్టులో ఒకరైన పీఎస్‌ మిత్రన్‌ తాజాగా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. జర్నలిస్టు ఆశామీరా అయ్యప్పన్‌ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూన్ లో నిశ్చాతార్థం చేసుకున్న ఈ జంట.. తాజాగా తంజావూర్ వేదికగా పెళ్లిపీటలెక్కారు.

PS Mithran: జర్నలిస్ట్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన స్టార్‌ డైరెక్టర్‌.. సందడి చేసిన హీరో కార్తీ.. ఫొటోలు వైరల్‌
Ps Mithran Marriage

Updated on: Feb 13, 2023 | 6:38 PM

విశాల్‌ హీరోగా వచ్చిన అభిమన్యుడు (తమిళ్‌లో ఇరుంబి తిరై) సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు పీఎస్‌ మిత్రన్‌. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్ తో కలిసి హీరో అనే సినిమాను డైరెక్ట్‌ చేశాడు. ఇది కూడా విజయం సాధించింది. ఇక గతేడాది కార్తీతో కలిసి తెరకెక్కించిన సర్దార్‌ సంచలన విజయం సాధించింది. దసరా కానుకగా విడుదలైన ఈ స్పై థ్రిల్లర్‌ భారీ వసూళ్లను రాబట్టింది. ఇలా తమిళ్‌లో స్టార్‌ డైరెక్టర్ల లిస్టులో ఒకరైన పీఎస్‌ మిత్రన్‌ తాజాగా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. జర్నలిస్టు ఆశామీరా అయ్యప్పన్‌ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూన్ లో నిశ్చాతార్థం చేసుకున్న ఈ జంట.. తాజాగా తంజావూర్ వేదికగా పెళ్లిపీటలెక్కారు.

ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో మిత్రన్‌- ఆశాల వివాహం గ్రాండ్‌గా జరిగింది. హీరో కార్తీ తదితర సెలబ్రిటీలు వీరి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు సినిమా సెలబ్రిటీలు కొత్త జంటకు విషెస్‌ చెబుతున్నారు. కాగా మిత్రన్‌ తన తర్వాతి ప్రాజెక్టును కూడా కార్తీతోనే చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..