జాంబిరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం హనుమాన్. యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు కారణం గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్. ఇందులో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ పొగిడేశారు. అప్పుడే విడుదలైన ఆదిపురుష్ టీజర్ కంటే.. ఈ మూవీ టీజర్ సినీప్రియులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 12న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉన్నట్లుండి హనుమాన్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు మేకర్స్.
‘‘హనుమాన్’ టీజర్‌పై మీరు చూపించిన ప్రేమాభిమానాలతో మాపై బాధ్యత మరింత పెరిగింది. హనుమంతుడి స్ఫూర్తికి అద్ధం పట్టేలా, మనం కలిసి ఆనందంగా పండుగల సెలబ్రేట్ చేసుకునేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తామని మీకు మాట ఇస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం” అని తెలిపారు.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో విజువల్ గా మెప్పించేలా రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, స్పానిష్, చైనీస్, జపనీస్, కొరియన్, ఇంగ్లీష్ ఇలా ఏకంగా 11 భాషలలో ఈ మూవీని రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో తేజా సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను కీలకపాత్రలలో నటిస్తుండగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
The excitement & anticipation for #HanuMan is sky high?
To give you all the best experience in theatres, The release date of HanuMan stands postponed for the best outcome!
A new release date will be announced soon.
A @PrasanthVarma Film
?ing @tejasajja123@Primeshowtweets pic.twitter.com/QOc3RvMJKx— Primeshow Entertainment (@Primeshowtweets) May 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.