AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Zombie Reddy’ Review : ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాంబి రెడ్డి’.. సినిమా ఎలా ఉందంటే..

తెలుగులో కొత్తరకం సినిమాలు ఇప్పుడు చాలానే వస్తున్నాయి. దర్శకులు కొత్త తరహా కథలు ట్రై  చేస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.  ఇప్పుడు కూడా ప్రశాంత్ వర్మ ఇదే చేసాడు

'Zombie Reddy' Review : ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జాంబి రెడ్డి'.. సినిమా ఎలా ఉందంటే..
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2021 | 3:22 PM

Share

నటీనటులు : తేజ సజ్జా-ఆనంది-దక్ష నగార్కర్-ఆర్జే హేమంత్-గెటప్ శ్రీను

సంగీతం : మార్క్ కె.రాబిన్

నిర్మాత : రాజశేఖర్‌ వర్మ

రచన-దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

తెలుగులో కొత్తరకం సినిమాలు ఇప్పుడు చాలానే వస్తున్నాయి. దర్శకులు కొత్త తరహా కథలు ట్రై  చేస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే చేసాడు. తాజాగా ఈయన తెరకెక్కించిన ‘జాంబి రెడ్డి’ సినిమా చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు హీరోగా వచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ : 

మారియో ( తేజ ) ఓ వీడియో గేమ్ డిజైనర్.. లాక్ డౌన్ ను ఖాతరు చేయకుండా.. తన స్నేహితులతో కలిసి మరో స్నేహితుడు కళ్యాణ్ ( ఆర్జే హేమంత్) పెళ్ళికి వెళ్తాడు. ఐతే ఫ్యాక్షన్ కుటుంబంలో అమ్మాయిని చేసుకోబోతున్న కళ్యాణ్ కు ప్రాణ హాని ఉందని గ్రహించిన మారియో అతణ్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు.ఈ లోగా ఆ ఊరిలో అనుకోని పరిణామాలు జరుగుతాయి. ఊరిలో వాళ్లంతా జాంబిలుగా మారిపోతుంటారు. కేవలం తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ మాత్రం మాములుగా ఉంటారు. అసలు ఆఊరిలోకి జాంబీలు ఎలా వచ్చాయి.? ఈ ఐదుగురు జాంబీలనుంచి తప్పించుకున్నారా..? ఉరిని కాపాడారా..? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

న‌టీన‌టుల అభినయం : 

ఈ సినిమాతో హీరోగా పరిచయమైన తేజ బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసాడు. ఆ అనుభవంతో వచ్చిన ఈజ్ అతడిలో కనిపిస్తుంది. అతను కొత్త కుర్రాడిలా అనిపించడు. హీరోయిన్ ఆనంది చూడ్డానికి చక్కగా అనిపిస్తుంది. నటన కూడా ఆకట్టుకుంటుంది. దక్ష నగార్కర్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. గెటప్ శీనుకు సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్‌ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్‌ టీమ్‌ కూడా ది బెస్ట్‌ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు.

విశ్లేష‌ణ‌ :

ప్రశాంత్‌ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్‌, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకే హెలైట్‌. రాయలసీమ ఫ్యాక్షనిజానికి కామెడీని జోడించి చూపించాడు ప్రశాంత్. ఫస్టాఫ్‌ కాస్త స్లో గా అనిపించినప్పటికీ సెకండాఫ్‌ ఆకట్టుకుంది. జాంబీ కాన్సెప్ట్ ను సైతం ప్రేక్షకులు ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేని విధంగా డీల్ చేయడం ‘జాంబి రెడ్డి’కి ప్రతికూలంగా మారింది. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్‌.

సాంకేతిక విభాగాల పనితీరు:

సాంకేతికంగా ‘జాంబి రెడ్డి’ బాగానే అనిపిస్తుంది. మార్క్ కె.రాబిన్ స్వర పరిచిన పాటల్లో ‘గో కరోనా’ ఆకట్టుకుంటుంది.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లెస్ అయ్యింది. అనీత్ ఛాయాగ్రహణం బాగుంది. చిన్న సినిమా అయినా పెద్ద చిత్రం స్థాయి ఔట్ పుట్ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా :  భయపెడుతూనే ఆకట్టుకున్న ‘జాంబి రెడ్డి’