
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన దర్శకులలో మారుతి ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను తెరకెక్కించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన ఆయన.. అతి తక్కువ బడ్జెట్ తో సూపర్ హిట్స్ తెరకెక్కించి తక్కువ సమయంలోనే సక్సెస్ అయ్యారు. ఇన్నాళ్లు తెలుగులో చిన్న చిన్న సినిమాలు రూపొందించిన మారుతి.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. అదే రాజాసాబ్. హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సోమవారం ఉదయం విడుదలైన రాజాసాబ్ టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ న్యూలుక్, డైలాగ్స్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ వింటేజ్ డార్లింగ్ కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజాసాబ్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే..టీజర్ విడుదలకు ముందు డైరెక్టర్ మారుతి చేసిన ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. దర్శకుడిగా తన ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు తన తండ్రి అరటిపళ్లు అమ్మిన ప్రాంతంలో ఇప్పుడు తన కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
“మచిలీపట్నం.. సిరి కాంప్లెక్స్ (గతంలో దాని పేరు కృష్ణ కిషోర్ కాంప్లెక్స్) ఒకప్పుడు అక్కడే మా నాన్న చిన్న దుకాణం పెట్టుకుని అరటిపళ్లు అమ్మేవారు. సినిమాల్లోకి అడుగుపెట్టాలనే ఆశలతో ఇక్కడ విడుదలైన అందరి హీరోల బ్యానర్లు నేనే రెడీ చేసేవాడిని. ఒక్కసారైనా అక్కడ నా పేరు చూడాలి అని కలలు కన్నవారిలో నేను ఒకడిని. ఇప్పుడు అదే కాంప్లెక్స్ వద్ద నిల్చొని నా ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకుంటే జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు మించి ఏం కావాలి ? ఈరోజు మా నాన్న ఉండుంటే ఎంతో గర్వపడేవారు. ఆయనను నేను చాలా మిస్ అవుతున్నాను. నాపై మీరందరు చూపించిన అభిమానానికి థాంక్యూ అనేది చిన్న మాట. నేను ఏ విధంగా డార్లింగ్ ను చూపించాలని ఆశపడ్డానో.. ఇప్పుడు అదే విధంగానే మీ అందరికి చూపించనున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి” అంటూ రాసుకొచ్చారు.
MACHILIPATNAM – Siri complex (krishna Kishore in past)
This is the place where my father once had a small banana stall…
Where I used to write for banners of all heroes films released in this theater dreaming with hope 🙂I was one of those who wished “okkasaraina mana peru… pic.twitter.com/Wnu3cCUoOz
— Director Maruthi (@DirectorMaruthi) June 16, 2025
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..