Director Maruthi : పాన్ ఇండియా ప్రేక్షకులు ప్రభాస్ మరో కోణాన్ని చూస్తారు.. డైరెక్టర్ మారుతి..

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. హారర్ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 27న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Director Maruthi : పాన్ ఇండియా ప్రేక్షకులు ప్రభాస్ మరో కోణాన్ని చూస్తారు.. డైరెక్టర్ మారుతి..
Director Maruthi

Updated on: Dec 28, 2025 | 7:09 AM

వచ్చే ఏడాది సంక్రాంతికి వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో రాజాసాబ్ ఒకటి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హార్రర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి కానుకగా అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా.. డిసెంబర్ 27న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాతో ప్రభాస్ మరో కోణాన్ని చూస్తారని అన్నారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “ప్రభాస్ గారిలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ పాన్ ఇండియా ప్రేక్షకులు ఇప్పటివరకు ఆ కోణాన్ని చూడలేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చాకా.. ప్రభాస్ గారిని చూసి ఈ సినిమాతో చాలా సంవత్సరాలు ఆయనను గుర్తుపెట్టుకుంటారు. ఆయన గెటప్ ఒక గ్రేట్ ఎపిసోడ్. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడు చూడని విధంగా ఉంటుంది” అని అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మేకప్, హెయిర్ స్టైల్, మాట్లాడే తీరు.. ప్రతిదీ కొత్తగా ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి :  The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..

ప్రభాస్ ఇన్నర్ స్వాగ్ ఉంటుందని.. ఆయన నిలబడే తీరు, కుర్చీలో కూర్చునే విధానంలో కూడా ఆ స్వా్గ్ కనిపిస్తుందని.. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అన్నారు మారుతి. ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయనున్నారు. హారర్ కామెడీ డ్రామాకు తమన్ సంగీతం అందించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.