Prabhas: దళపతి డైరెక్టర్‏తో ప్రభాస్ సినిమా.. రెబల్ స్టార్ కోసం పవర్‏ఫుల్ స్టోరీ రెడీ..

|

Mar 15, 2024 | 3:58 PM

ఇప్పుడు కల్కి 2898AD, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు డార్లింగ్. ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2 మూవీస్ పట్టాలెక్కనున్నాయి. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్టులకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తన నెక్ట్ మూవీ ప్రభాస్ తో తెరకెక్కించనున్నాడనే టాక్ వినిపిస్తుంది.

Prabhas: దళపతి డైరెక్టర్‏తో ప్రభాస్ సినిమా.. రెబల్ స్టార్ కోసం పవర్‏ఫుల్ స్టోరీ రెడీ..
Prabhas, Lokesh Kanagaraj
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీస్ కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ నటవిశ్వరూపం చూసి ఫుల్ ఖుషి అయ్యారు అభిమానులు. దీంతో ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు కల్కి 2898AD, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు డార్లింగ్. ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2 మూవీస్ పట్టాలెక్కనున్నాయి. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్టులకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తన నెక్ట్ మూవీ ప్రభాస్ తో తెరకెక్కించనున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే డార్లింగ్ కోసం ఓ అందమైన లవ్ స్టోరీని రెడీ చేశారని టాక్. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్స్ అప్డేట్ రాలేదు.

తాజాగా ప్రభాస్ నెక్ట్స్ మూవీపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదెంటంటే.. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారట. వీరిద్దరి కాంబోలో మంచి మాస్ యాక్షన్ మూవీ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ ప్రభాస్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశారని.. ఈ ప్రాజెక్టును ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. అంతేకాకుండా వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో లోకేష్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఇప్పటివరకు అపజయమెరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్, కార్తితో ఖైది, విజయ్ దళపతో మాస్టర్, లియో వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించి తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం లోకేష్.. టాలీవుడ్ బ్యూటీ శ్రుతిహాసన్ తో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హసన్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.