Director Krishna Vamshi: రామ్ చరణ్‏తో సినిమా చేసేందుకు రెడీ.. స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉంది.. డైరెక్టర్ కృష్ణవంశీ..

|

Jul 18, 2024 | 8:15 PM

డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాల్లో మురారీ ఒకటి. ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా 2001లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. ఈ చిత్రంలో మహేష్ సరసన సోనాలి బింద్రే నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

Director Krishna Vamshi: రామ్ చరణ్‏తో సినిమా చేసేందుకు రెడీ.. స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉంది.. డైరెక్టర్ కృష్ణవంశీ..
Krishna Vamsi, Ram Charan
Follow us on

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాల గురించి చెప్పక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలో ఎన్నో అందమైన సినిమాలను రూపొందించిన అద్భుతమైన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. గులాబీ, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ, రంగమార్తండా.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అందమైన కుటుంబకథా చిత్రాలను తెరకెక్కించి.. అలాగే తన సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా అద్భుతంగా డిజైన్ చేయడంలో ఆయనకు సాటి మరెవరు లేరు. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాల్లో మురారీ ఒకటి. ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా 2001లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. ఈ చిత్రంలో మహేష్ సరసన సోనాలి బింద్రే నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు మురారీ సాంగ్స్, క్లిప్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మురారీ రీరిలీజ్ అంటూ ప్రత్యేకంగా వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే డైరెక్టర్ కృష్ణవంశీ కూడా నెట్టింట యాక్టివ్ అయ్యారు. మహేష్ బాబు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మురారి సినిమాకు సీక్వెల్ తీసుకువస్తారా ? అని అడగ్గా.. తన సినిమాలకు పార్ట్ 2, కొనసాగింపు ఉండదని స్పష్టం చేశారు.

మురారి, ఖడ్గం లాంటి సినిమాలు మళ్లీ మీ నుంచి ఆశించవచ్చా..? అని అడగ్గా.. మురారి విషయం తెలియదు గానీ.. ఖడ్గం లాంటి సినిమా రానుందని అన్నారు. మహేష్ బాబుతో మళ్లీ సినిమా ఎప్పుడూ తీస్తారు అని మరో నెటిజన్ క్వశ్చన్ చేయగా… ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ స్టార్.. కష్టం అని అన్నారు. రామ్ చరణ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇస్తానని ప్రామిస్ చేశారు.. గుర్తుందా ? అని మరో నెటిజన్ అంటే.. స్క్రిప్ట్ రెడీగా ఉందని..అలాగే రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు తాను కూడా రెడిగానే ఉన్నాని.. చరణ్ ఎప్పుడు ఒకే అంటే అప్పుడు సినిమా తీస్తానని అని అన్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.