టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు కృష్ణవంశీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరిర్ మొదలు పెట్టిన కృష్ణవంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణవంశీ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆతర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలు చేశారు. నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతాలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆతర్వాత మహేష్ బాబుతో మురారి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే 2002లో ఖడ్గం సినిమాతో మరో భారీ హిట్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి.
తాజాగా కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడారు. తాను గురుజీగా భావించే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ఎమోషనల్ అయ్యారు. కృష్ణవంశీకి సీతారామ శాస్త్రి ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాసిన పాటలన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన శిఖరం. నేను ఒక గులకరాయి. ఈ రెండింటి మధ్య పోలికలు ఉండవు. రెండు రాళ్లే అయిఉండొచ్చు కానీ పోలిక ఉండదు. ఆయనకు నేను నచ్చడం నా అదృష్టం. నన్ను చేరదీశారు అని అన్నారు కృష్ణవంశీ.
ఖడ్గం , శ్రీఆంజనేయం,మహాత్మ, శశిరేఖా పరిణయం ఇలా ఈ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. శ్రీఆంజనేయం సినిమా సాంగ్ లో రొమాన్స్ కు టచ్ అవ్వకుండా ఆంజనేయస్వామి తత్వం చెప్పారు. అలాగే శశిరేఖా పరిణయం సినిమాలోని పాటల్లో రామతత్వం, కృష్ణతత్వం రెండింటినీ చూపారు అని అన్నారు. అలాగే సీతారామ శాస్త్రి మరణం గురించి మాట్లాడుతూ.. ఆయన మరణ వార్త విని నేను షాక్‌కు గురయ్యాను. మూడు రోజులు పట్టింది దాని నుంచి బయటకు రావడానికి.. ఆయన్ని నిర్జీవంగా చూస్తే నేను తట్టుకోలేను. అందుకే ఆయన చనిపోయిన తర్వాత రాలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు కృష్ణవంశీ.
The last n final part … My GURUJI … Great show .. thx to ramcherugaru n parthu garu .. hope u like it . THQ ❤️ pic.twitter.com/a75cuhUali
— Krishna Vamsi (@director_kv) July 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.