Harish Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బద్రి సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో పవన్‌లోని ఎనర్జీని పూర్తిగా వాడుకున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. పూరీ మార్క్ డైలాగ్‌లకు పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ యాక్షన్ తోడుకావడంతో ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులకు వీనుల విందు చేసింది. అయితే మరోసారి పవన్‌లో ఆ రేంజ్ ఎనర్జీని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయనున్నాడట దర్శకుడు హరీశ్ శంకర్.
పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని హరీశ్‌తో చేయనున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా కోసం హరీశ్ ఇప్పటికే పనులు మొదలుపెట్టేశారు. ఇదిలా ఉంటే తాజాగా హరీశ్ శంకర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో పవన్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బద్రీకి సినిమాకు సంబంధించి పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌లతో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేసిన హరీశ్.. `మరోసారి ఇదే ఎనర్జీని చూద్దాం` అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో పవన్ మరోసారి బద్రి స్థాయి విజయాన్ని అందుకోవడం ఖాయం అంటూ పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వరుస అపజయాలు ఎదుర్కొంటోన్న సమయంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్‌తో మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కారు. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Keerthy Suresh: కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..