AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Deva Katta: నా సినిమాలో ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్‌ చర్చించే విషయమే: దేవాకట్టా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఇటీవలే ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసింద. దేవాకట్టా దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

Director Deva Katta: నా సినిమాలో ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్‌ చర్చించే విషయమే: దేవాకట్టా
Devakatta
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2021 | 9:54 AM

Share

Director Deva Katta: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఇటీవలే ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసింద. దేవాకట్టా దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా  రెస్పాన్స్ అందుకుంది. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ మంచి వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఓటీటీ లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5.. ఈసందర్భంగా రిపబ్లిక్ మూవీ దర్శకుడు నాకు కూడా ఫ్యామిలీ స్టోరీస్‌ చేయాలని ఉంది. నా దగ్గర 2,3 స్టోరీస్‌ ఉన్నాయి అన్నారు. వెన్నెల కూడా నేను అనుకున్న స్థాయిలో చేయలేదనిపిస్తుంది. వెన్నెల తర్వాత ప్రస్థానం కథ చెబితే కొందరు హీరోలు వెన్నెలకు కొద్దిగా యాక్షన్‌ కలిపి తీసుకురా అన్నారు. ప్రస్థానం తర్వాత అది తప్ప మరోటి ఊహించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. దాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి హీరోలు ఇంట్రస్ట్‌ చూపిస్తూ ఉంటారు అన్నారు.

ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఇంత పెద్ద రెస్పాన్స్‌ వస్తుందని మేం ముందే ఊహించాం. సినిమామీద మాకు ముందు నుంచి చాలా నమ్మకం ఉంది. గతంలో ఓ ప్రతిఘటన, ఓ రేపటిపౌరులు వంటి కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాం. కానీ గత 15, 20 సంవత్సరాలుగా ఆ సెక్షన్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌ను కోల్పోయాం. అది మనం చేసినతప్పే. ప్రేక్షకులకు మనం సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఉన్న కంటెంట్‌ను ఇస్తే తప్పకుండా ఆనందిస్తారు.. ఆదరిస్తారు. మా ‘రిపబ్లిక్‌’ ఓటీటీలో గ్రాండ్‌ సక్సెస్‌ కావటానికి ప్రధాన కారణం.. జీ5 వారు ప్రమోట్‌ చేసిన విధానమే అని కన్‌ఫర్మ్‌గా చెప్పగలను. ఆడియెన్స్‌ అంటే అందరూ మన మనసులోనే ఉంటారు. కాబట్టే మనం రాసే క్యారెక్టర్స్‌ వారికి కనెక్ట్‌ అవుతుంటాయి. రిపబ్లిక్‌ లోని ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్‌ చర్చించే విషయమే. ఈ కథ సమాజంలోని ఒక డీప్‌ డిస్టబెన్స్‌ నుంచి పుట్టింది కాబట్టే అంతగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యింది. నెక్ట్స్‌ ఏ ఎమోషన్‌తో సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పుకొచ్చారు దర్శకుడు దేవాకట్టా

మరిన్ని ఇక్కడ చదవండి : 

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!

Follow Us
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
మిథున రాశిలో రవి.. వారికి ప్రతి ప్రయత్నంలో విజయం..!
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?