
మెగా ఫ్యాన్స్, టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు సన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కథ చెప్పగానే రామ్ చరణ్ ఒకే అన్నారు.. ఆ తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు చిరంజీవి సైతం తనకు కథ చెప్పాలని అన్నారు. ఆయనకు నేను కథ చెప్పడం అనేది జీవితంలోనే గొప్ప అనుభవం.. ఎంతో ఆసక్తిగా వింటారు అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు .
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..
అంతేకాకుడా పెద్ది సినిమా షూటింగ్ సెట్ కు చిరంజీవి వచ్చారని.. అక్కడ చరణ్ పడుతున్న కష్టాన్ని చూసి గంటన్నర కంటే ఎక్కువసేపు ఉండలేకపోయాని అన్నారు. చిరు సెట్ కు వచ్చినప్పుడు చరణ్ కుస్తీ పోటీ సీన్ షూటింగ్ జరుగుతుందని.. ఎండలో అలా రామ్ చరణ్ కష్టపడడం చూడలేక అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. మనం ఎంత కష్టపడితే అందుకు తగిన ఫలితం వస్తుందని చిరంజీవి చెప్పారని గుర్తు చేసుకున్నారు. శ్రమకు తగిన ఫలితాన్ని అడియన్స్ తప్పకుండా ఇస్తారని చిరంజీవి తనతో చెప్పిన విషయం గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..
పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం గొప్ప అనుభూతి అని.. కలిసి కథ చెప్పిన మొదటిసారే తన ఫోన్ నంబర్ ఇచ్చారని.. అప్పటి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోనే ఉన్నారని.. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..
ఎక్కువ మంది చదివినవి : Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..