
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తొలి సినిమా ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు సంచలన విజయాన్ని అందుకున్నాడు. అదే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఉప్పెన తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు పెద్ది సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఊర మాస్ గెటప్ లో చరణ్ కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్ది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కంటే ముందే మరో భామను సంప్రదించారట. దీని గురినిక్ బుచ్చిబాబు మాట్లాడారు. నేను మొదట ‘అచ్చియమ్మ’ పాత్రను జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్‌కు వినిపించాను. కానీ, ఆమెను పర్సనల్‌గా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్‌కు ఆమె చాలా చిన్న పిల్లలా అనిపించింది” దాంతో ఆమె అక్క జాన్వీని హీరోయిన్ గా ఎంపిక చేశా.. ఒకే ఇంట్లో ఉంటూ చెల్లిని వద్దని, అక్కకు కథ చెప్పాల్సి రావడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒకవేళ ఖుషీ ఫీల్ అయ్యిందా అని జాన్వీని అడిగాను అని బుచ్చిబాబు తెలిపారు.
మొదటి నుంచి నేను జాన్వీనే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యా.. ఎవరికైనా కథ చెప్పినా కూడా నా కళ్లముందు జాన్వీనే కనిపించింది అని బుచ్చిబాబు అన్నారు. 1980ల నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో జాన్వీ ‘అచ్చియమ్మ’గా డీగ్లామర్, పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది. మరి ఈ సినిమా జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా పెద్ది సినిమా జూన్ 4న గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.