Chiranjeevi: బాలయ్య సినిమాకు మెగాస్టార్ స్పెషల్ విషెస్.. ఆనందంలో అభిమానులు

అనిల్ రావిపూడి దర్శకత్వం వచ్చిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. భగవంత్ కేసరి సినిమా తర్వాత ఇప్పుడు బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

Chiranjeevi: బాలయ్య సినిమాకు మెగాస్టార్ స్పెషల్ విషెస్.. ఆనందంలో అభిమానులు
Balakrishna, Chiranjeevi

Updated on: Jan 18, 2024 | 3:52 PM

నటిసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వచ్చిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. భగవంత్ కేసరి సినిమా తర్వాత ఇప్పుడు బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక బాలకృష్ణ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. ఇదిలా ఉంటే బాబీ డైరెక్షన్ లో చిరంజీవి సినిమా చేసిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో బాబీకి చిరంజీవి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ గారు సినిమాకు విషెస్ తెలిపారని చెప్పారు బాబీ. బాలకృష్ణ సినిమా మొదలు పెట్టిన తర్వాత తనకు చిరంజీవి కాల్ చేసి స్పెషల్ విషెస్ తెలియజేసారు. మన సినిమా కంటే బాలకృష్ణ గారి సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని అన్నారట మెగాస్టార్. బాలకృష్ణ సినిమా గురించి చిరంజీవి చెప్పిన విషెస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.