K. S. Ravindra: మీకు వన్ పర్సెంట్ కూడా రాజకీయాలు కరెక్ట్ కాదు.. మీ తమ్ముడు చూసుకుంటాడు.. చిరంజీవి పై డైరెక్టర్ బాబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇక్కడో గుంటూరులో మెగాస్టార్ ఫ్యాన్స్ లో నేను ఒకడిని.. 2003నుంచి 2023వరకు ఎదురుచూశాను ఇప్పటికి అదృష్టం దక్కింది. చిరంజీవి గారి గురించి ఏం చెప్పగలం.. మీలాంటి వాళ్ళు ఉండాలి అన్నయ్య.

K. S. Ravindra: మీకు వన్ పర్సెంట్ కూడా రాజకీయాలు కరెక్ట్ కాదు.. మీ తమ్ముడు చూసుకుంటాడు.. చిరంజీవి పై డైరెక్టర్ బాబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Bobby

Updated on: Jan 09, 2023 | 11:30 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవితోపాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో వాల్తేరు వీరయ్య మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ పాత్రలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ బాబీ.

అన్నయ్య రాజకీయాలు మీకు వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు. దేవుడు మీకు ఒక తమ్ముణ్ణి ఇచ్చాడు .. ఆయన చూసుకుంటాడు .. ఆయన సమాధానం చెబుతాడు.. ఆయన గట్టిగా నిలబడతాడు. మీలోని ఆవేశం .. మంచితనం కలిస్తే పవన్ కల్యాణ్. మాటకి మాట … కత్తికి కత్తి పవర్ స్టార్ అని అన్నారు

అలాగే ఇక్కడో గుంటూరులో మెగాస్టార్ ఫ్యాన్స్ లో నేను ఒకడిని.. 2003నుంచి 2023వరకు ఎదురుచూశాను ఇప్పటికి అదృష్టం దక్కింది. చిరంజీవి గారి గురించి ఏం చెప్పగలం.. మీలాంటి వాళ్ళు ఉండాలి అన్నయ్య. ఇంతమంది బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన మనసే కారణం. నిద్రలో కూడా సినిమా గురించి ఆలోచించాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకున్నా. చిరంజీవి గారి కంటే ముందు పవన్ కళ్యాణ్ తో పని చేశా.. అదే మంచి తనం, అదే మంచి గుణం. ఆయనలోనూ కనిపించింది. ఇక్కడ ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి అంతే అని అన్నారు డైరెక్టర్ బాబీ.

ఇవి కూడా చదవండి