Anudeep KV: అయ్యో పాపం.. ఎంత కష్టమొచ్చిందో.. ఇద్దరమ్మాయిల మధ్య జాతిరత్నాలు డైరెక్టర్.. ఫన్నీ వీడియో..

|

Aug 15, 2024 | 2:48 PM

బయట ఈవెంట్లలో అనుదీప్ కనిపించే తీరు.. మాట్లాడే విధానం చూస్తే అందరికి నవ్వులు తెప్పిస్తాయి. తను నవ్వుకుండా తన మాటతీరుతో జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అనుదీప్ కామెడీ టైమింగ్ ను అడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. దీంతో కొన్ని రోజులుగా పలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనుదీప్ ను అతిథిగా పిలుస్తుంటారు. ఇక అనుదీప్ స్టేజ్ ఎక్కితే చాలు ప్రేక్షకులను తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది.

Anudeep KV: అయ్యో పాపం.. ఎంత కష్టమొచ్చిందో.. ఇద్దరమ్మాయిల మధ్య జాతిరత్నాలు డైరెక్టర్.. ఫన్నీ వీడియో..
Anudeep
Follow us on

డైరెక్టర్ అనుదీప్ తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‏లో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. ఆ సినిమా ప్రమోషన్లలో బుల్లితెరపై పలు షోలలో పాల్గొని సందడి చేశాడు. ముఖ్యంగా క్యాష్ ప్రోగ్రామ్ లో అనుదీప్ చేసిన అల్లరి గురించి తెలిసిందే. ఈ షోతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. అలాగే బయట ఈవెంట్లలో అనుదీప్ కనిపించే తీరు.. మాట్లాడే విధానం చూస్తే అందరికి నవ్వులు తెప్పిస్తాయి. తను నవ్వుకుండా తన మాటతీరుతో జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అనుదీప్ కామెడీ టైమింగ్ ను అడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. దీంతో కొన్ని రోజులుగా పలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనుదీప్ ను అతిథిగా పిలుస్తుంటారు. ఇక అనుదీప్ స్టేజ్ ఎక్కితే చాలు ప్రేక్షకులను తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. తాజాగా అనుదీప్ కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో జాతిరత్నాలు డైరెక్టర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి అయ్యాయ్యో.. ఎంత కష్టమొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల ఆయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లారు అనుదీప్. ఆ వేడుకలో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఈ వేడుకలో అనుదీప్ కు ఓవైపు హీరోయిన్ శ్రీలీల, మరోవైపు సింగర్ మంగ్లీ కూర్చున్నారు. అప్పుడు అనుదీప్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మాములుగా లేవు. ఇద్దరి మధ్య కూర్చోవడం ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. నిజానికి అనుదీప్ ఇంట్రోవర్ట్.. ఆయన తెరకెక్కించే సినిమాలు కడుపుబ్బా నవ్వించినా అనుదీప్ మాత్రం బయట చాలా ఇంట్రోవర్ట్. ఇక ఇప్పుడు ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుదీప్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంట్రోవర్ట్స్.. ఇద్దరు అమ్మాయిల మధ్య కూర్చోవడమే చాలా కష్టం.. అయ్యాయో ఎంతో కష్టమొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న అనుదీప్ వీడియోకు 90s మిడిల్ క్లాస్ మెలోడీస్ వెబ్ సిరీస్ సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని పాటను బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేయడంతో ఆ వీడియో చూడగానే తెప్పించేలా ఉంది. అనుదీప్ చివరిసారిగా ప్రిన్స్ సినిమాను రూపొందించారు. ఇందులో శివకార్తికేయన్ హీరోగా నటించాడు.

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.