Anil Ravipudi: నటుడిగా మారి యాక్టింగ్ చేస్తానంటున్న డైరెక్టర్.. ఆసక్తికర విషయాలను చెప్పిన అనిల్ రావిపూడి..
కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధానపాత్రలలో నటించగా..
ఎఫ్ 3 సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి (Anil Ravipudi).. తాజాగా ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను మరోసారి మెప్పించాడు.. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధానపాత్రలలో నటించగా.. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించారు. ఇప్పటివరకు కామెడీ జోనర్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి.. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణతో యాక్షన్ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నానని.. కామెడీని పక్కన పెట్టి మాస్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అనిల్. అంతేకాదు.. ఇప్పటివరకు డైరెక్టర్గా హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 మూవీలో బుట్టబొమ్మతో కలిసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకున్నారు. అయితే తాజాగా తాను యాక్టింగ్ కూడా చేస్తానంటూ మనసులోని మాటలను బయటపెట్టాడు..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. దర్శకత్వంలో ఆయన బాగా తృప్తి చెంది.. ఆడియన్స్ తన సినిమాలను ఇక చాలు అని ఫీలయ్యే వరకు సినిమాలకు దర్శకత్వం వహిస్తానని.. ఆ తర్వాత నటనలోకి దిగి నటుడిగా మారిపోతానంటూ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల తన సినిమాలను ఆదరిస్తున్నంతవరకు దర్శకుడిగా మరిన్ని చిత్రాలను తెరకెక్కిస్తానన్నాడు. ఎఫ్ 3 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. ప్రస్తుతం బాలకృష్ణతో చేయబోయే సినిమా పనులపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నాడని.. ఆయన కూతురిగా యువ కథానాయిక శ్రీలీల కనిపించనుందని గత కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఇందులో బాలయ్యకు జోడిగా మెహ్రీన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరి సినిమా గురించిన పూర్తి విషయాలను అధికారికంగా ప్రకటించబోతున్నారట.