A S Ravi Kumar Chowdary: ముక్కుసూటితనం.. వివాదాలు.. రవికుమార్ చౌదరి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలివే

ప్రముఖ డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ చౌదరి హఠాన్మరణం టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలకృష్ణ, గోపీచంద్ లాంటి సీనియర్ హీరోలతో పాటు నితిన్, సాయి దుర్గ తేజ్, నితిన్, రాజ్ తరుణ్ తదితర యంగ్ హీరోలతో సినిమాలు తీసిన ఆయన మంగళవారం (జూన్ 10) రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

A S Ravi Kumar Chowdary: ముక్కుసూటితనం.. వివాదాలు.. రవికుమార్ చౌదరి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలివే
As Ravi Kumar Chowdary Deat

Updated on: Jun 11, 2025 | 12:42 PM

టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ చౌదరి హఠాన్మరణం చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం (జూన్ 10) రాత్రి తుది శ్వాస విడిచారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రవి కుమార్ చౌదరి ఉన్నట్లుండి కన్నుమూయడం టాలీవుడ్ ప్రముఖులతో పాటు అందరినీ కలిచివేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రవి కుమార్ చౌదరికి నివాళి అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక రవికుమార్ చౌదరి విషయానికి వస్తే.. ఏపీలోని గుంటూరుకు చెందిన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 1995లోనే కృష్ణ నటించిన అమ్మదొంగ సినిమాకు రవి కుమార్ చౌదరి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు సాగర్ వద్దనే సుమారు దశాబ్ద కాలం పాటు పని చేశారు. అలాగే మధ్యలో శ్రీనువైట్ల తెరకెక్కించిన నీ కోసం సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

 

ఇవి కూడా చదవండి

అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి..

2002లో యజ్ఞం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు రవి కుమార్ చౌదరి. గోపీ చంద్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడీ డైరెక్టర్. ఎన్నో ఆశలు పెట్టుకుని బాలకృష్ణతో తెరకెక్కించిన వీర భద్ర సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే నితిన్ తో చేసిన ఆటాడిస్తా సినిమా కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు రవి కుమార్. అయితే 2014లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన పిల్లా నువ్వులేని జీవితం సూపర్ హిట్ అయ్యింది. . ఈ సినిమా రవికుమార్ ను మళ్లీ దర్శకుడిగా నిలబెట్టింది. దీని తర్వాత తనకు మొదటి సినిమా అవకాశం కల్పించిన గోపీచంద్ తో మరొకసారి ‘సౌఖ్యం’ సినిమా చేశారు. అయితే ఈ మూవీ పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాజ్ తరుణ్ తో ‘తిరగబడరా సామి’ తెరకెక్కించాడు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇలా వరుసగా సినిమాలు పరాజయం పాలవ్వడంతో రవి కుమార్ చౌదరి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని ఆ మధ్యన ప్రచారం జరిగింది.ఈ క్రమంలోన మద్యానికి కూడా బానిసైనట్లు రూమర్లు వచ్చాయి.

స్టార్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు

కాగా తిరగబడరా సామి సినిమా ప్రమోషన్లలో భాగంగా రవి కుమార్ చౌదరి వరుసగా వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈ సినిమా హీరోయిన్లలో ఒకరైన మన్నారా చోప్రా ను ఆయన బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం వివాదానికి దారితీసింది. అలాగే ఓ సినిమా ఈవెంట్ లో ఓ స్టార్ హీరోను ఉద్దేశిస్తూ రవి కుమార్ చేసిన కామెంట్స్ కూడా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ముక్కుసూటి మనిషిగా పేరొందిన రవి కుమార్ చౌదరి తన సినిమాలతో పాటు వివాదాలతోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి మనిషి ఇప్పుడు సడెన్ గా ఈ లోకాన్ని విడచి పెట్టి వెళ్లడం అందరినీ షాక్ కు గురి చేసింది.

1556098,1556111,1556066,1555976

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.