Dil Raju: దిల్‌ రాజు ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. ఏపీ బిజినెస్‌మెన్‌తో వియ్యం అందుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్‌

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. నవంబర్‌ 3న వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి వివాహం జరగనుంది. ఇటీవలే విక్టరీ వెంకటేష్‌ కూతురు హయవాహిని నిశ్చితార్థం కూడా గ్రాండ్‌గా జరిగింది. అలాగే సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత కీరవాణి కుమారుడు శ్రీ సింహా..

Dil Raju: దిల్‌ రాజు ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. ఏపీ బిజినెస్‌మెన్‌తో వియ్యం అందుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్‌
Dill Raju, Ashish Reddy

Updated on: Oct 28, 2023 | 8:46 AM

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. నవంబర్‌ 3న వరుణ్‌ తేజ్‌ – లావణ్య త్రిపాఠి వివాహం జరగనుంది. ఇటీవలే విక్టరీ వెంకటేష్‌ కూతురు హయవాహిని నిశ్చితార్థం కూడా గ్రాండ్‌గా జరిగింది. అలాగే సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత కీరవాణి కుమారుడు శ్రీ సింహా, మురళీ మోహన్‌ మనవరాలు రాగ పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఇంట్లోనూ పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. దిల్‌ రాజు సోదరుడు అయిన శిరీష్‌ కొడుకు ఆశిష్‌ రెడ్డి వివాహం త్వరలోనే జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో దిల్‌ రాజు ఫ్యామిలీ వియ్యం అందుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే నిశ్చితార్థం వేడుక జరిపి, వచ్చే ఏడాది ప్రారంభంలో ఆశిష్‌ పెళ్లి వేడుకలు జరపనున్నట్ల సమాచారం. అయితే ఈ పెళ్లి వేడుకపై దిల్‌ రాజు కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆశిష్‌ రెడ్డి పెళ్లి పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమేనట. దిల్‌ రాజు తండ్రి చనిపోక ముందే ఈ పెళ్లి గురించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయట.

ఆశిష్‌ రెడ్డి రౌడీ బాయ్స్‌ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న ఆశిష్‌ త్వరలోనే సెల్ఫిష్‌ మూవీతో మళ్లీ మన ముందుకు రానున్నాడు. లవ్‌ టుడే ఫేమ్‌ ఇవానా ఆశిష్‌ సరసన నటిస్తోంది. కసి విశాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పెళ్లికి ముందే ఈ మూవీని రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. కాగా కొద్ది రోజుల క్రితం దిల్‌ రాజు, శిరీష్‌ల తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన కుటుంబంలో ఏదైనా శుభ కార్యం జరిగితే మంచిదనే ఆలోచనతో ఆశిష్‌ రెడ్డి పెళ్లి చేయాలని దిల్‌ రాజు కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఆశిష్‌ పెళ్లి వేడుకకు ప్లాన్‌ చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి

‘సెల్ఫిష్’ గా రానున్న ఆశిష్ రెడ్డి..

దళపతి విజయ్ తో ఆశిష్ రెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..