స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తూ రాణిస్తున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే.. చిన్న హీరోలతోనూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. దిల్ రాజు ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. కాగా ఓ సినిమా గురించి దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
Dilraju

Updated on: Apr 26, 2026 | 10:31 AM

టాలీవుడ్ లో తిరుగులేని ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు దిల్ రాజు. డిటిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు దిల్ రాజు. బడా సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు దిల్ రాజు. తెలుగు సినిమాలతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో తాను అనుసరించే నీతి, విలువలను వివరంగా పంచుకున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్, డబ్బు రావడం, పోవడం వంటివి ఇక్కడ సాధారణమని, కానీ తాను నిలబడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు

కేవలం డబ్బు వెనుక పరుగెత్తకుండా, సినిమా విజయం ద్వారా వచ్చే డబ్బునే కోరుకుంటానని, పరాజయాల ద్వారా వచ్చే డబ్బును తాను ఆస్వాదించనని తెలిపారు. సినిమా బడ్జెట్, కథతో పాటు, ఎడిటింగ్ రూమ్ లోనే 90% సినిమా భవితవ్యం తెలిసిపోతుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎడిటింగ్ సమయంలోనే తనలో సందేహాలు వస్తే, అది సినిమా ఫ్లాప్ అయ్యే సంకేతమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన మున్నా సినిమా ఉదాహరణతో వివరించారు. ప్రభాస్ హీరోగా నటించిన మున్నా చిత్రం విడుదలైన రోజున 3 గంటల షో చూడగానే అది పక్కా ఫ్లాప్ అవుతుందని అర్థమైందని , వెంటనే డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి, సినిమా కొంత నిరాశపరుస్తుందని, అయితే తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చానని చెప్పారు దిల్ రాజు.

ఇది కూడా చదవండి :Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట

అదేవిధంగా, మణిరత్నం గారి చెలియా చిత్రం విషయంలోనూ విడుదల ముందురోజే అది బ్యాడ్ ఫిల్మ్ అని గుర్తించి, డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేశారన్నారు. ఓకే బంగారం లాంటి విజయం తర్వాత మణిరత్నం గారిపై నమ్మకంతో చెలియా తీసుకున్నప్పటికీ, అది మిస్‌ఫైర్ అయిందని పేర్కొన్నారు. తన కెరీర్ ప్రారంభంలో దిల్ చిత్రం తర్వాత నిన్నే ఇష్టపడ్డాను సినిమా డిస్ట్రిబ్యూషన్ లో దిల్ లాభాలన్నీ కోల్పోయినట్లు, ఆ తర్వాత జై చిత్రంతో మరింత నష్టపోయి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. అయితే, సరిగ్గా అలాంటి షేకింగ్ సమయంలోనే ఆర్య వంటి విజయాలు తనను నిలబెట్టాయని చెప్పారు. విమర్శలు, వివాదాలు, బంధాలు దెబ్బతినడం వంటివి ఎదురైనప్పుడు, 90% తాను ఎదుటివారిలోని ప్లస్ పాయింట్లను చూసి సర్దుబాటు చేసుకుంటానని, లేదంటే మెల్లగా దూరం అవుతానని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు, ఆ రంగంలోని కష్టనష్టాలు తనకు తెలుసు కాబట్టే, వారికి అత్యంత గౌరవం ఇస్తానని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే, తాను సహించనని, స్పందిస్తానని వెల్లడించారు. పరిశ్రమలో 90% నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లేనని, సంవత్సరానికి 10-20 విజయవంతమైన చిత్రాలు వస్తే, దాదాపు వంద సినిమాలు కొనే డిస్ట్రిబ్యూటర్లు 80 చిత్రాల్లో నష్టపోతారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : OTT Movie : పాడుబడ్డ కాలేజ్‌లో బాధతో విలవిలలాడే ఆత్మ.. సినిమా వచ్చి 25ఏళ్లు.. చూస్తే ఇప్పటికీ తడిసిపోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us