Mahesh Babu: దిల్‌ రాజు ఇంట పెళ్లి వేడుక.. మహేశ్‌ బాబు దంపతులకు ప్రత్యేక ఆహ్వానం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు శిరీష్‌ కుమారుడు హీరో ఆశిష్‌ రెడ్డి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్ర‌ముఖ వ్యాపారవేత్త కూతురైన అద్విత రెడ్డితో అశిష్‌ రెడ్డి ఏడడుగులు వేయనున్నాడు

Mahesh Babu: దిల్‌ రాజు ఇంట పెళ్లి వేడుక.. మహేశ్‌ బాబు దంపతులకు ప్రత్యేక ఆహ్వానం
Mahesh Babu, Dil Raju Famil

Updated on: Feb 09, 2024 | 5:34 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు శిరీష్‌ కుమారుడు హీరో ఆశిష్‌ రెడ్డి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్ర‌ముఖ వ్యాపారవేత్త కూతురైన అద్విత రెడ్డితో అశిష్‌ రెడ్డి ఏడడుగులు వేయనున్నాడు. గతేడాది నవంబర్‌ లో వీరి నిశ్చితార్థం గ్రాండ్‌ గా జరిగింది. ఫిబ్రవరి 14న జైపూర్‌ వేదికగా ఆశిష్‌- ఆద్వితా రెడ్డిల వివాహం జరగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు దిల్‌ రాజు కుటుంబ సభ్యులు. ఇదే సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌, చిరంజీవి, రామ్‌ చరణ్‌ , జూనియర్‌ ఎన్టీఆర్‌, రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌, మంచు మోహన్‌ బాబు తదితర ప్రముఖులకు శుభలేఖలు అందించారు. తాజాగా సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు దంపతులకు దిల్‌ రాజు శుభలేఖ అందించారు. ఫిబ్రవరి 14 జరిగే వివాహ వేడుకకు తప్పకుండా రావాలని మహేశ్‌, నమ్రతలను కోరారు దిల్‌ రాజు, ఆశిష్‌ రెడ్డి. మహేశ్‌ ను కలిసిన వారిలో హన్షితా రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఆశిష్‌ రెడ్డి రౌడీ బాయ్స్‌ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో మలయాళం బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటించింది. యూత్‌ ను బాగానే ఆకట్టుకుందీ సినిమా. అయితే రౌడీ బాయ్స్‌ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ఆశిష్ రెడ్డి. ఇప్పుడు సెల్ఫీష్‌ అనే మరో సినిమాతో ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో లవ్‌ టుడే మూవీ ఫేమ్‌ ఇవానా హీరోయిన్‌ గా నటిస్తోంది. కసి విశాల్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాబు దంపతులకు ఆహ్వానం..

రామ్ చరణ్ దంపతులకు..

సెల్ఫీష్ సినిమాలో ఆశిష్ రెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..