పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. జగపతి బాబు సందడే సందడి, అల్లు అర్జున్, ఉదయ్ కిరణ్ ఔనన్నా కాదన్నా తదితర సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించింది. అయితే మధ్యలో చదువు ఇతర కారణాలతో సినిమాలకు బ్రేక్ వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మాయి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా మళ్లీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. అందం. అభినయం పరంగా మంచి మార్కులే తెచ్చుకుంది. అయితే ఎందుకో కానీ క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ ఫొటోస్ తో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోన్న ఈ హీరోయిన్ మరెవరో కాదు లవ్ యూ బంగారం’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన శ్రావ్య. పలు సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించిన ఆమెకు హీరోయిన్ గా ఇదే సినిమా. ఇందులో శ్రావ్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. అయితే సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
లవ్ యూ బంగారం సినిమా తర్వాత , ‘కాయ్ రాజా కాయ్’, ‘నందిని నర్సింగ్ హోం’ తదితర సినిమాల్లో నటించింది శ్రావ్య. తమిళంలోనూ ‘పగిరి విలాయెట్టు’ వంటి ఒకటి, రెండు మూడు సినిమాల్లో నటించింది. కానీ క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. శ్రావ్య 2017లో చివరిగా ఓ సినిమాలో నటించింది. ఆ తర్వాత మరే మూవీలోనూ నటించలేదు.
ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రావ్య.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. మరి ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఎప్పుడు వెండితెరపై కనిపిస్తుందో చూడాలి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.