Tillu Square: టిల్లు, లిల్లి.. మధ్యలో తెలుగమ్మాయి.. టిల్లు స్క్వేర్ సినిమాలో ఆ హీరోయిన్‍ను గమనించారా ?..

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ డే ఏకంగా రూ. 23 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే శని, ఆది వారాల్లో టిల్లు స్క్వేర్ సినిమాకు మరిన్ని వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ గ్లామరస్ లుక్స్‏లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది.

Tillu Square: టిల్లు, లిల్లి.. మధ్యలో తెలుగమ్మాయి.. టిల్లు స్క్వేర్ సినిమాలో ఆ హీరోయిన్‍ను గమనించారా ?..
Tillu Square Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2024 | 8:36 AM

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు చిత్రానికి ఇది సీక్వెల్. డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 29న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. మొదటి రోజే హిట్ టాక్ అందుకుని భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ డే ఏకంగా రూ. 23 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే శని, ఆది వారాల్లో టిల్లు స్క్వేర్ సినిమాకు మరిన్ని వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ గ్లామరస్ లుక్స్‏లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది.

ఇన్నాళ్లు ట్రెడిషనల్ బ్యూటీగా కనిపించిన అనుపమ… ఈ మూవీలో మాత్రం హద్దులు చేరిపేసింది. దీంతో టిల్లు స్క్వేర్ విడుదలకు ముందు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ టిల్లు స్క్వేర్ రిలీజ్ అనంతరం అనుపమ పోషించిన పాత్రపై పాజిటివ్ టాక్ వస్తుంది. ఇందులో అనుపమతోపాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా కనిపించిన సంగతి తెలిసిందే. డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో కనిపించిన నేహా శెట్టి.. ఈ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. దీంతో మరోసారి బిగ్ స్ర్కీన్ పై రాధికను చూసిన ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేశారు. ఫస్ట్ పార్టులో రాధిక పాత్రలో కనిపించిన నేహా.. ఇందులోనూ మరోసారి రాధిక పాత్రలోనే కనిపించింది. టిల్లుతో రాధికను చూడగానే థియేటర్లలో అరుపులు, విజిల్స్ తో నానా హడావిడి చేశారు అడియన్స్.

ఇక ఈ సినిమాల అనుపమ, నేహా శేట్టి కాకుండా మరో హీరోయిన్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. తనే తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ట్యాక్సీవాలా, ఎస్ఆర్. కళ్యాణమండపం సినిమాలతో హిట్స్ అందుకున్న ప్రియాంక ఆ తర్వాత అవకాశాలు తగ్గడం సైలెంట్ అయ్యింది. ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఇక ఇప్పుడు సడెన్‏గా టిల్లు స్క్వేర్ చిత్రం గెస్ట్ రోల్ పోషించింది. దీంతో ఇప్పుడు ప్రియాంక టిల్లు స్క్వేర్ యూనివర్స్ లో భాగమైందని.. ఇకపై తనకు మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమని అంటున్నారు. మరీ చూడాలి తెలుగులో ప్రియాంకకు ఆఫర్స్ వస్తాయేమో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..