Vaishnavi Chaitanya: వైష్ణవి నువ్వు సూపర్.. దిల్ రాజుతో కలిసి స్టేజ్ పై పాట పాడిన హీరోయిన్.. వీడియో వైరల్..

అందులో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ మీ. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. దెయ్యంతో ప్రేమ కోసం ఓ యువకుడు ఏం చేశాడనే క్యూరియాసిటీ కలిగిస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా లవ్ మీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

Vaishnavi Chaitanya: వైష్ణవి నువ్వు సూపర్.. దిల్ రాజుతో కలిసి స్టేజ్ పై పాట పాడిన హీరోయిన్.. వీడియో వైరల్..
Vaishnavi Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2024 | 8:13 AM

షార్ట్ ఫిల్మ్స్‏తో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో కథానాయికగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ తెలుగమ్మాయి… అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంది. అటు ఇండస్ట్రీలో వైష్ణవికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. అందులో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ మీ. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. దెయ్యంతో ప్రేమ కోసం ఓ యువకుడు ఏం చేశాడనే క్యూరియాసిటీ కలిగిస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా లవ్ మీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. రావాలి రా అంటూ సాగే మెలోడీని నిన్న హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.

చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను అమల చేబోలు, గోమతి ఐయర్, అదితి భావరాజు, అజ్మల్ పర్వీన్, సాయి శ్రేయ సింగర్స్ తోపాటు.. హీరోయిన్ వైష్ణవి కూడా పాడారు. ఇందుకు కీరవాణి.. వైష్ణవికి వారం రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇచ్చారని సమాచారం. ఇక నిన్న ఈ పాటను రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై ప్రొడ్యూసర్ దిల్ రాజు, వైష్ణవి చేత రావాలి రా సాంగ్ పాడించారు. అంతే కాదు తను కూడా వైష్ణవితోపాటు హమ్ చేశారు.

దిల్ రాజుకి సంగీతంపై మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య నటించిన జోష్ సినిమాలో అన్నయోచ్చినాడు అంటూ మాస్ సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. ఇక చాలా కాలం తర్వాత మరోసారి సాంగ్ పాడి అలరించారు. నిన్న జరిగిన సాంగ్ లాంచ్ వేడుకలో దిల్ రాజు, వైష్ణవి కలిసి పాట పాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.