Rajamouli: రాజమౌళి ప్రతి సినిమాలో చత్రపతి శేఖర్ ఎందుకు ఉంటాడో తెలుసా ?.. కారణమదే..

|

Apr 07, 2023 | 5:35 PM

ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ స్టార్స్ కూడా జక్కన్న సినిమాలో ఒక చిన్న రోల్ చేసిన చాలు అనుకుంటారు. కానీ రాజమౌళి ప్రతి సినిమాలో కొందరు నటీనటులు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటివరకు ఆయన రూపొందించిన ప్రతి సినిమాలో కనిపించిన నటులలో చత్రిపతి శేఖర్ ఒకరు.

Rajamouli: రాజమౌళి ప్రతి సినిమాలో చత్రపతి శేఖర్ ఎందుకు ఉంటాడో తెలుసా ?.. కారణమదే..
Rajamouli
Follow us on

ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ అందుకోవడమే కాకుండా.. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ సైతం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పుడు వరల్డ్ మొత్తం రాజమాళి గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో హాలీవుడ్ మేకర్స్ సైతం జక్కన్న చిత్రాలను పొగిడేస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ స్టార్స్ కూడా జక్కన్న సినిమాలో ఒక చిన్న రోల్ చేసిన చాలు అనుకుంటారు. కానీ రాజమౌళి ప్రతి సినిమాలో కొందరు నటీనటులు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటివరకు ఆయన రూపొందించిన ప్రతి సినిమాలో కనిపించిన నటులలో చత్రిపతి శేఖర్ ఒకరు. రాజమౌళి రూపొందించిన శాంతి నివాసం సీరియల్ నుంచి మొన్న వచ్చిన ట్రిపుల్ ఆర్ చిత్రం వరకు ప్రతి సినిమాలో ఆయన కనిపిస్తుంటారు.

రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మొదలుకొని.. సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న, ఈగ, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో కనిపించాడు శేఖర్. ఇప్పటివరకు జక్కన్న మొత్తం 12 చిత్రాలు తెరకెక్కించగా.. 9 సినిమాల్లో ఉన్నాడు శేఖర్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటంచిన చత్రపతి సినిమాలో హీరో స్నేహితుడిగా కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఈ మూవీ నుంచి అతని పేరు చత్రపతి శేఖర్‏గా మారిపోయింది. అయితే రాజమౌళి సినిమాలలో శేఖర్ కనిపించడానికి ఓ కారణం ఉందట. అదేంటో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి

రాజమౌళి దర్శకత్వం వహించిన శాంతి నివాసం సీరియల్ సమయంలోనే శేఖర్‏తో పరిచయం ఉందట. కానీ శేఖర్ ఎప్పుడూ జక్కన్నను అవకాశాలు ఇవ్వాలని అడగలేదట. కానీ నటుడిగా తనకు సపోర్ట్ చేయాలనే ఉద్ధేశంతో రాజమౌళి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు శేఖర్. సినిమా స్టార్ట్ చేశాక జక్కన్న పిలుస్తాడని.. అప్పటివరకు సినిమా ఏంటీ.. తన పాత్ర ఏంటనేది తనకు తెలియదని అన్నారు. మొదటి సీరియల్లో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత స్నేహానికి జక్కన్న ఇచ్చే విలువ తెలిసి హ్యాట్సాఫ్ రాజమౌళి అంటున్నారు నెటిజన్స్.