Uppena Movie: బ్లాక్ బస్టర్‌ మూవీ ‘ఉప్పెన’లో మొదట ఆ స్టార్ హీరోను అనుకున్నారా? ఎలా మిస్ అయ్యాడబ్బా!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ఉప్పెన. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇద్దరికీ ఇదే మొదటి సినిమా. అయితేనేం వంద కోట్లు సాధించి ఇద్దరికీ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీలో హీరోగా మొదట వైష్ణవ్ తేజ్ ను అనుకోలేదట.

Uppena Movie: బ్లాక్ బస్టర్‌ మూవీ ఉప్పెనలో మొదట ఆ స్టార్ హీరోను అనుకున్నారా? ఎలా మిస్ అయ్యాడబ్బా!
Uppena Movie

Updated on: May 23, 2025 | 5:29 PM

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో చేయాల్సిన కథ మరో హీరో దగ్గరకు పోవడం ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి స్టార్ హీరో వద్దనుకున్న సినిమా సూపర్ హిట్ ఇవ్వచ్చు ఇంకోసారి డిజాస్టర్ అవ్వచ్చు. ఉప్పెన సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. డైరెక్టర్ గా అతనికి ఇదే మొదటి సినిమా. అయితేనేం తన టేకింగ్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడు. మొదటి సినిమాతోనే వంద కోట్లు రాబట్టాడు. ఈ మూవీలో హీరో, హీరోయిన్లుగా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించారు. మొదటి సినిమానే అయినా ఇద్దరూ అద్బుతంగా నటించారు. సిల్వర్ స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇక విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్ ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఉప్పెన సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు సినిమా అవార్డుకు ఎంపికైంది.

కాగా ఉప్పెన సినిమాకి హీరోగా ఫస్ట్ ఛాయిస్ వైష్ణవ్ తేజ్ కాదట. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండను హీరోగా ఊహించుకునే ఉప్పెన స్టోరీ ని రాసుకున్నాడట. అయితే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం ఎగిరిపోయింది. దీంతో తన కథ విజయ్ కు అస్సలు సూట్ కాదని బుచ్చిబాబు భావించారట. దీంతో హీరోగా వైష్ణవ్ తేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే షూటింగ్ పట్టాలెక్కడం, మూవీ బ్లాక్ బస్టర్ కావడం టకా టకా జరిగిపోయాయట.  అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.

ఇవి కూడా చదవండి

పేరెంట్స్ తో విజయ్ దేవరకొండ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.