హనీరోజ్.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిందీ మలయాళ ముద్దుగుమ్మ. బాలయ్య డబుల్ రోల్ పోషించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు ఉన్నా హానీ రోజే తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో అయితే ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను సెర్చ్‌చేసి మరీ ఫాలో అయిపోతున్నారు. కొత్త ఫొటోలు అప్‌లోడ్ గానే లైకుల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో హనీరోజ్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల క్రష్‌గా మారిపోయిన హనీరోజ్ 14 ఏళ్ల క్రితమే ఓ తెలుగు సినిమాలో నటించింది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ సినిమా పేరు ఆలయం. సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాజీ హీరోగా నటించాడు. ఆ సినిమాని ట్రెండ్ సెట్ ఫిలింస్ పతాకంపై అనూప్ చక్రవర్తి నిర్మించారు. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో హనీరోజ్‌కు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత 2014 లో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఈ వర్షం సాక్షిగా సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.అయితే మలయాళంలో మాత్రం మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నిరోజుల క్రితం విడుదలైన మోహన్‌లాల్ మాన్‌స్టర్ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో మంచులక్ష్మీ కూడా కీలక పాత్ర పోషించింది. కేరళలోని ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది హనీరోజ్. తండ్రి పేరు థామస్ కాగా తల్లి పేరు రోజ్. 15 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రం లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వీరసింహారెడ్డి సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న హానీరోజ్ ఇకపై మరిన్ని తెలుగు సినిమాల్లోనూ నటించవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..