Mahesh Babu: మహేష్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా ఉదయ్ కిరణ్ చేయాల్సిందా? ఇన్నాళ్లకు వెలుగులోకి షాకింగ్ విషయం

టాలీవుడ్ లో ఎంతో వేగంగా హీరోగా ఎదిగి అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యిన హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకడు. ఒకానొకదశలో సినిమా ఛాన్సులు రాక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడీ హ్యాండ్సమ్ హీరో. చివరకు 33 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

Mahesh Babu: మహేష్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా ఉదయ్ కిరణ్ చేయాల్సిందా? ఇన్నాళ్లకు వెలుగులోకి షాకింగ్ విషయం
Mahesh Babu, Uday Kiran

Updated on: Jun 04, 2025 | 1:13 PM

చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటి చిత్రంతోనే అందరి మన్ననలు అందుకున్నాడు. ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’, ‘కలుసుకోవాలని’, ‘హోలీ’, ‘నీ స్నేహం’, ‘ఔనన్నా కాదన్నా’, వంటి ప్రేమకథా చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే ఫిల్మ్ ఫేర్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నాడు. అయితే కాల క్రమేణా ఈ హీరోకు వరుసగా ఫ్లాపులు పడ్డాయి. ఒకానొకదశలో సినిమా ఛాన్సులు కరువయ్యాయి. దీంతో డిప్రెషన్ బారిన పడ్డ ఉదయ్ కిరణ్ 2014లో తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటికీ అతనికి కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. సినిమా ఇండస్ట్రీలో రారాజుగా వెలుగొందుతాడనుకున్న ఉదయ్ కిరణ్ మరణం అందరినీ కలచి వేసింది. కాగా సినిమాల సెలక్షన్ పరంగా ఉదయ్ కిరణ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా అతని భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేశాయి. ఔనన్న కాదన్నా తర్వాత సుమారు ఓ 10 సినిమాల్లో నటించాడీ హ్యాండ్సమ్ హీరో. కానీ ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.

 

ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన ఓ సూపర్ సినిమా ముందు ఉదయ్ కిరణ్ దగ్గరికే వెళ్లిందట. అయితే ఉదయ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ మూవీ మిస్ అయ్యింది. దీంతో ఉదయ్ నుంచి మహేష్ దగ్గరకి ఆ సినిమా వెళ్లింది. తీరా చూస్తే ఆ సినిమా రిలీజై సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ మరేదో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అతను. 2005లో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ముందుగా ఉదయ్ కిరణ్ కి వినిపించారట. కథ బాగుండడంతో అతను కూడా ఒకే చెప్పాడు. మేకర్స్ కూడా ఉదయ్ కిరణ్ తో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమ చేసి ఉంటే ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ మరోలా ఉండేదేమో!

అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని ఉదయ్ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఈ విషయాన్ని అతడు సినిమా నిర్మాత మురళి మోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఉదయ్ కిరణ్ కి అతడు సినిమా పడి ఉంటే అతని కెరీర్ ఇంకో రేంజ్ లో ఉండేదంటూ సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు

Athadu Movie

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.