Tollywood:ఈ టాలీవుడ్ హీరో మాస్టారు కూడా.. సినిమాలు చేస్తూ సీఏ విద్యార్థులకు పాఠాలు.. 12 ఏళ్లుగా హైదరాబాద్ లో..

ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. 40కు పైగా సినిమాల్లో నటించి నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. అలాగే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి మెప్పించాడు. అయితే ఈ టాలీవుడ్ హీరో మాస్టారు కూడా అన్న విషయం చాలా మందికి తెలియదు.

Tollywood:ఈ టాలీవుడ్ హీరో మాస్టారు కూడా.. సినిమాలు చేస్తూ సీఏ విద్యార్థులకు పాఠాలు.. 12 ఏళ్లుగా హైదరాబాద్ లో..
Tollywood Actor

Updated on: Aug 06, 2025 | 7:55 PM

ఈ హీరో ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరులో పుట్టి పెరిగాడు. బీఏ తెలుగు పట్టా పుచ్చుకున్నాడు. అలాగే లా అండ్ కంపెనీ సెక్రటరీ కూడా పూర్తి చేశాడు. అందుకే ఓ వైపు సినిమాలు చేస్తూనే సీఏ (చార్డర్డ్ అకౌంటెంట్స్) విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ తదితర నగరాల్లో కొలువై ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో సీఏ ఫ్యాకల్టీగా పని చేశాడు. ఇప్పటికీ కూడా ఆన్ లైన్ క్లాసులు చెబుతన్నట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు చిన్నతనంలోనే బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తన నటనా ప్రతిభకు ఏకంగా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమ కథా చిత్రాలు, లవ్ స్టోరీలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సీరియల్స్, వెబ్ సిరీసుల్లోనూ నటించి మెప్పించాడు. బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. కొన్ని టీవీ షోలకు యాంకర్ గానూ వ్యవహరిస్తున్నాడు. ఇలా టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అనిపించుకుంటోన్న ఆ హీరో మరెవరో కాదు బాలా దిత్య.

 

ఇవి కూడా చదవండి

ఓవైపు సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలు చేస్తూనే మరోవైపు సీఏ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నాడు బాలా దిత్య. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలాదిత్య స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు. కలువ (రాజమండ్రి), స్పెల్‌బౌండ్ (హైదరాబాద్), గ్యాన్ (విజయవాడ), ఎడ్వైస్ (హైదరాబాద్) వంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో CA ఫ్యాకల్టీగా పని చేశాడు బాలా దిత్య. ప్రస్తుతం 1Fin ఇండిగో లెర్న్‌ అనే సంస్థలో ఈ హీరో ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నాడు. ఇందుకు సంబంధించి బాలాదిత్య ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో కొన్ని ఆన్ లైన్ క్లాసుల వీడియోలు కూడా ఉన్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకుని సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బాలాదిత్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

సీఏ క్లాసులు చెబుతోన్న బాలా దిత్య.. వీడియో

కాగా పొలిమేర 2 సినిమాలో కనిపించిన బాలా దిత్య ప్రస్తుతం ఎక్కువగా బుల్లితెరపైనే కనిపిస్తున్నాడు. పలు టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి