Premante Idera: ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? కట్ చేస్తే ఇప్పుడు..

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ప్రేమంటే ఇదేరా ఒకటి. 1998 రిలీజైన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. ఇందులో వెంకటేష్ కు జోడీగా బాలీవుడ్ అందాల తార ప్రీతి జింటా నటించింది. ఈ నెల 13న వెంకటేష్‌ బర్త్ డే కానుకగా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.

Premante Idera: ప్రేమంటే ఇదేరా సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? కట్ చేస్తే ఇప్పుడు..
Premante Idera Movie

Updated on: Dec 04, 2025 | 6:52 PM

90’sలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాఉ విక్టరీ వెంకటేష్. అలాగే రొమాంటిక్ లవ్ స్టోరీస్ తోనూ ఆడియెన్స్ ను మెప్పించారు. అలా 1998లో వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమా ప్రేమంటే ఇదేరా. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. బాక్సాఫీస్ క్లీన్ హిట్ గా నిలిచిన ఈ మూవీ అప్పట్లోనే రూ. 8 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఇందులోని పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. రమణ గోగుల అందించిన సాంగ్స్ సంగీతాభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. జయంత్‌ సీ పరాన్జీ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో భారీ తారగణమే ఉంది. ఇందులో వెంకటేష్‌కి జోడీగా బాలీవుడ్ అందాల తార ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించింది. సినిమా సూపర్ హిట్ అవ్వడానికి వెంకీ, ప్రీతి జింటా మధ్య కెమిస్ట్రీ కూడా ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే ప్రేమంటే ఇదేరా సినిమాలో హీరోయిన్‌ గా ప్రీతి జింటా ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ రోల్ కోసం మొదట బాలీవుడ్‌ హీరోయిన్‌, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. ఆమె కూడా కథ విని ఓకే చెప్పిందట. అయితే ఎందుకోగానీ అనూహ్యంగా ఈ లవ్ స్టోరీ నుంచి తప్పుకుందట. దీంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని ఐశ్వర్యా రాయ్‌ కోల్పోయింది. అలాగే ఒక ఇండస్ట్రీ హిట్ ను కూడా మిస్ చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత రావోయి చందమామ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించడం విశేషం. ఈ సినిమాకు కూడా జయంత్ సి పరాన్జీనే తెరకెక్కించడం విశేషం.

ఇవి కూడా చదవండి

వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా మళ్లీ థియేటర్లలోకి ప్రేమంటే ఇదేరా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.