Jabardasth: గవర్నమెంట్ జాబ్ వదిలేసి.. HYDలో ఇసుక, సిమెంట్ బస్తాలు మోసి.. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో..

ప్రస్తుతం జబర్దస్త్ లో స్టార్ కమెడియన్లుగా ఉన్న వారిలో చాలా మంది కెరీర్ ప్రారంభంలో చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ అయితే నటనపై మక్కువతో ఏకంగా గవర్నమెంట్ జాబ్ వదలుకున్నాడు. తీరా హైద్రాబాద్ కు వచ్చాక కూలీ పనులు చేశాడు.

Jabardasth: గవర్నమెంట్ జాబ్ వదిలేసి..  HYDలో ఇసుక, సిమెంట్ బస్తాలు మోసి.. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో..
Jabardasth Comedian

Updated on: May 25, 2026 | 7:44 PM

జబర్దస్త్ కంటెంట్ మీద కొంచెం విమర్శలు ఉండొచ్చు.. అలాగే గతంలో కంటే ఇప్పుడు ఈ షోకు ఉన్న క్రేజ్, ఆదరణ తగ్గిపోయిన మాట కూడా వాస్తవమే. కానీ ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిందీ బుల్లితెర కామెడీ షో. జబర్దస్త్ లో చేసిన ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ… ఇలా చాలా మంది హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా సత్తా చాటుతున్నారు. అయితే వీరంతా జబర్దస్త్ కు రాక ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కుటుంబ పోషణ కోసం పడరాని పాట్లు పడ్డారు. ఎలాంటి భేషజాలకు పోకుండా చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో మెరుస్తోన్న ఓ కమెడియన్ కష్టాలు అయితే మరీ దారుణం. చదువులో టాపర్ అయిన అతను ఎంచెక్కా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. ఉద్యోగంలో పనికి కూడా చేరాడు. కానీ సినిమాలు, నటన అంటే ఆసక్తి ఉండడంతో జాబ్ కు రిజైన్ చేశాడు.

ఇక హైద్రాబాద్ కు వచ్చి ఇంటి రెంట్ కట్టలేక 10 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్‌కి ఇసుక, సిమెంట్, ఇటుకలు మోసుకుంటూ వెళ్లేవాడు. ఒకానొకదశలో ఈ కష్టాలు పడలేక ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు. కానీ ఇంతలోన పటాస్ లో అవకాశం వచ్చింది. అ తర్వాత జబర్దస్త్ లోనూ అవకాశం వచ్చింది. అంతే అతని జీవితం మారిపోయింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు అప్పుడుప్పుడు సినిమాల్లోనూ మెరుస్తోన్న ఆ కమెడియన్ మరెవరో కాదు నూకరాజు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

 కో ఆర్టిస్ట్ ఆసియాతో జబర్దస్త్ నూకరాజు..

‘నేను పటాస్‌కి రాకముందు విజయవాడ పవర్ ఫ్లాంట్‌లో పనిచేసేవాడ్ని. గవర్నమెంట్ జాబ్ వదిలేసి పటాస్ షోకి వచ్చా. పటాస్ కంటే ముందు ఓ టీవీ షో కోసం హైద్రాబాద్- విజయవాడ కు తరచూ తిరుగుతూ ఉండేవాడిని. అయితే రెండు బ్యాలెన్స్ చేయలేక.. ఉద్యోగం వదిలేశాను. విషయంలో నాకు బాధలేదు కానీ అమ్మా.. నాన్న చాలా బాధపడ్డారు. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత ఖర్చులకి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. పది అంతస్తుల బిల్డింగ్‌కి ఇసుక, సిమెంట్, ఇటుకలు భుజం పై పెట్టుకుని మోశాను’ అని అప్పటి కష్టాలను గుర్తు తెచ్చుకున్నాడు నూకరాజు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us