AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పనిచేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు

ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్లలో ఇతను కూడా ఒకరు. ఒకవైపు సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఈ కామెడీ షో లోనే సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకలను కడుపుబ్బా నవ్విస్తున్నాడీ స్టార్ కమెడియన్. అయితే ఒకప్పుడు ఈ నటుడు మెడికల్ షాపులో పని చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు. ఆరేళ్ల పాటు వైజాగ్ లోనే ఉంటూ..

Jabardasth: ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పనిచేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
Jabardasth Actor
Basha Shek
|

Updated on: Sep 03, 2026 | 10:12 PM

Share

సుమారు గత 13 ఏళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోండి జబర్దస్త్ కామెడీ షో. 2013లో ప్రారంభమైన ఈ టీవీ షో కారణంగా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్స్, టీమ్ లీడర్లుగా పనిచేసిన ఎంతో మంది ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది జబర్దస్త్ ఆర్టి స్టులు హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా ఇప్పుడు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. అయితే జబర్దస్త్ కు రాక ముందు వీరంతా ఎన్నో కష్టాలు పడ్డారు. పొట్ట నింపుకోవడం కోసం పడరాని పాట్లు పడ్డారు. కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే చేతి కొచ్చిన పనులన్నీ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ కూడా సరిగ్గా ఇదే జాబితాకు చెందుతాడు. ఈ నటుడు కనీసం ఇంటర్మీడియెట్ కూడా పూర్తి చేయలేదు. కుటుంబ పోషణ కోసం వైజాగ్ లో ఓ మెడికల్ షాపులో పని చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు ఆరేళ్ల పాటు మెడికల్ షాపులోనే పని చేశాడు. ఇదే క్రమంలో నటనపై ఆసక్తి ఉండడంతో తన స్నేహితుడి సాయంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. రైటింగ్ లోనూ ట్యాలెంట్ చూపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇంతకీ అతనెవరని అనుకుంటున్నారా?

త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కు జబర్దస్త్ నుంచి కూడా ఇద్దరు స్టార్ కమెడియన్లు వెళుతున్నారు. అందులో ఆటో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. పైన చెప్పుకున్న స్టోరీ ఈ కమెడియన్ దే. రచయితగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ ప్రసాద్. ఆ తర్వాత సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి స్కిట్స్ చేస్తూ స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమా అవకాశాలు రావడంతో చాలా కాలం క్రితమే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ వదిలేశారు. కానీ రామ్ ప్రసాద్ మాత్రం ఇప్పటికీ జబర్దస్త్ స్కిట్స్ రాస్తూనే కమెడియన్ గా రాణిస్తున్నాడు. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కన్ఫార్మ్ కంటెస్టెంట్ల లిస్టులో రామ్ ప్రసాద్ పేరు ఉందని తెలుస్తోంది. కాబట్టి త్వరలోనే ఇతను కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతున్నాడని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్షా బంధన్ వేడుకల్లో ఆటో రామ్ ప్రసాద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us