Chiranjeevi: మెగాస్టార్‌కు అక్కగా.. పవర్ స్టార్‌కు అమ్మగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు పవన్ కల్యాణ్. అనతి కాలంలోనే తన నటనతో పవర్ స్టార్ గా ఎదిగాడు. అభిమానుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగానూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Chiranjeevi: మెగాస్టార్‌కు అక్కగా.. పవర్ స్టార్‌కు అమ్మగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Chiranjeevi, Pawan Kalyan

Updated on: Sep 11, 2025 | 9:38 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానముంది. చిరంజీవి వేసిన మార్గంలోనే నడుస్తూ ఆ ఫ్యామిలీ నుంచి సుమారు అరడజనకు పైగా హీరోలు వచ్చారు. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరు. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే పవన్ స్టార్ గా ఎదిగారు. తన స్టైలిష్ యాక్టింగ్ తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక రాజకీయాల్లోనూ సక్సెస్ అయిన పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో ఎంతో మంది హీరోయిన్లు నటించారు. కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్ లాంటి హీరోయిన్లైతే ఇద్దరితోనూ మెగా బ్రదర్స్ ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఓ అందాల తార మెగాస్టార్ చిరంజీవితో మాత్రం యాక్ట్ చేయలేకపోయింది. కానీ ఆ తర్వాతి కాలంలో ఆమెనే చిరంజీవికి అక్కగా నటించి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఓ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అమ్మగా కూడా నటించింది. ఆమె మరెవరో కాదు కోలీవుడ్ అందాల తార ఖుష్బూ.

చిరంజీవి పక్కన హీరోయిన్‌గా ఒక్క సినిమాలోనూ ఖుష్బూ నటించలేదు కానీ స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ కు అక్కగా నటించింది. ఝాన్సీగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో కూడా ఖుష్బూ ఒక సినిమాలో నటించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా..? త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి. ఇందులో ఆమె పవన్ కళ్యాణ్ తల్లిగా నటించింది. ఇలా చిరంజీవికి అక్కగా, పవన్ కల్యాణ్‌కు అమ్మగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఖుష్బూ నిలిచింది. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తోన్న ఈ అందాల తార రాజకీయాల్లోనూ బిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

సైమా వేడుకల్లో ఖుష్బూ సందడి..

సుహాసినితో కలిసి సైమా అవార్డుల ప్రదానోత్సవంలో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి