AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishkindhapuri Movie Review: కిష్కింధపురి మూవీ రివ్యూ.. బెల్లంకొండ హిట్టు కొట్టాడా..?

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం కిష్కింధపురి. హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? బెల్లంకొండ కోరుకున్న హిట్ తీసుకొచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Kishkindhapuri Movie Review: కిష్కింధపురి మూవీ రివ్యూ.. బెల్లంకొండ హిట్టు కొట్టాడా..?
Kishkindhapuri Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 11, 2025 | 10:06 PM

Share

మూవీ రివ్యూ: కిష్కింధపురి

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, సాండీ మాస్టర్, తణికెళ్ల భరణి, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు

సంగీతం: చేతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: చిన్మయ్ సలస్కార్

ఎడిటర్: నిరంజన్ దేవరమనే

దర్శకుడు: కౌశిక్ పెగళ్లపాటి

నిర్మాత: సాహు గారపాటి

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం కిష్కింధపురి. హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? బెల్లంకొండ కోరుకున్న హిట్ తీసుకొచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ఇద్దరూ ప్రేమికులు.. ఒకేచోట పని చేస్తుంటారు. హార్రర్ హౌజ్ అనే కాన్సెప్ట్ తీసుకుని లేని దెయ్యాలను ఉన్నాయని చూపించి జనాలను నమ్మించి.. వాళ్లకు కిక్ ఇస్తుంటారు. అలా ఓసారి కిష్కింధపురి సువర్ణ మాయ రేడియో స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లతో పాటు మరో 8 మంది వస్తారు. అప్పటి వరకు వాళ్లు సెట్ చేసిన మాయలు కాబట్టి ఏం కాదు.. కానీ అక్కడ నిజంగానే ఆత్మ ఉంటుంది. ఆ కిష్కింధపురి ఊరిలో సువర్ణమాయ రేడియో స్టేషన్ నుంచి వచ్చే వింత వాయిస్ విని చుట్టు పక్కల వాళ్లెవ్వరూ అటువైపు కూడా వెళ్లరు. కానీ రాఘవ్ బ్యాచ్ అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. దాంతో అసలక్కడ ఏముంది..? రేడియో స్టేషన్‌లో 1989లో ఏం జరిగింది..? అసలు ఆత్మ కథ ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి..

కథనం:

హార్రర్ థ్రిల్లర్స్‌కు ఆయువు పట్టు స్క్రీన్ ప్లే.. కథ లేకపోయినా.. కథనం ఉంటే చాలు పాస్ అయిపోతుంటాయి. కిష్కింధపురి ఈ విషయంలో సగమే సక్సెస్ అయింది.. చాలా ఇంట్రెస్టింగ్‌గా సినిమా మొదలవుతుంది. మరీ ముఖ్యంగా తొలి 10 నిమిషాలు అదిరిపోతుంది. 1989లో కథ ఓపెన్ అయిన వెంటనే వింత శబ్ధాలతో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అదిరిపోయాయి. చాలా క్యూరియాసిటీ మధ్య మొదలైన సినిమా.. ఆ తర్వాత 20 నిమిషాలు నీరసంగా సాగుతుంది. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాలి అనిపించే పాట బాగా ఇబ్బందికరంగా అనిపించడమే కాదు.. కథకు కూడా అడ్డం పడుతుంది. అరగంట తర్వాత అసలు ఆట మొదలైంది.. ఇంటర్వెల్ వరకు చాలా వేగంగా వెళ్లిపోతుంది కథ. కొన్ని సీన్స్ అయితే బాగా భయపెట్టారు కూడా. స్క్రీన్ ప్లే కూడా బాగా రేసీగా వెళ్లిపోయింది. ముఖ్యంగా ఓ ట్రైన్ సీన్ అయితే నెక్ట్స్ లెవల్. ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వీక్.. దెయ్యానికి ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. దానికితోడు రాఘవ లారెన్స్ తీసిన కాంచన సిరీస్ గుర్తుకొస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తుంటే. ఆ తర్వాత కూడా చాలా సేపు నీరసంగానే సాగుతుంది కథ. ప్రీ క్లైమాక్స్ వరకు స్లో నెరేషన్ బాగా ఇబ్బందే. క్లైమాక్స్ కూడా కాస్త రొటీన్ అయిపోయింది. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం సినిమాను చూడాలనిపించేలా చేసాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే హార్రర్ సీన్స్ బాగున్నాయి.. సెకండాఫ్ స్మశానం సీన్ కూడా బాగుంది. టెక్నికల్‌గా మాత్రం కిష్కింధపురి ఆకట్టుకుంటుంది..

నటీనటులు:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. అనుపమ పరమేశ్వరన్ సినిమా అంతా ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో మరో ఎత్తు. సాండీ మాస్టర్ కూడా అదరగొట్టాడు. లోక తర్వాత మరో ఖతర్నాక్ క్యారెక్టర్ పడింది ఈయనకు. హైపర్ ఆది అక్కడక్కడా బాగానే నవ్వించాడు. సుదర్శన్ పర్లేదు. శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం.. మిగిలిన అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. హారర్ సన్నివేశాల్లో BGM భయాన్ని డబుల్ చేసింది. విజువల్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం ఫస్టాఫ్ వరకు బాగుంది.. కీలకమైన సెకండాఫ్ మాత్రం వదిలేసాడేమో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులు బాగున్నా.. కథనం అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ ఊహించినట్టు అనిపించినా, సీక్వెల్ హింట్ ఇవ్వడం ఆసక్తి రేపుతుంది. రాముడి ఎపిసోడ్ కూడా బాగానే ఉంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా కిష్కింధపురి.. సగం భయపెట్టి.. సగం వదిలేసారు..!

Follow Us
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..
సెంచరీలతో చెలరేగిన హర్మన్‌, దీప్తి శర్మ.. జింబాబ్వే టార్గెట్ 329
సెంచరీలతో చెలరేగిన హర్మన్‌, దీప్తి శర్మ.. జింబాబ్వే టార్గెట్ 329
‘డర్టీ పిక్చర్’ లాంటి రోల్స్ కోసం విద్యాబాలన్ వెయిటింగ్‌
‘డర్టీ పిక్చర్’ లాంటి రోల్స్ కోసం విద్యాబాలన్ వెయిటింగ్‌
ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యేది ఎప్పుడో..?
ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యేది ఎప్పుడో..?
చిన్న చిన్న ప్రయత్నాలతో పెద్ద విజయం.. తెలివైన కాకి కథ
చిన్న చిన్న ప్రయత్నాలతో పెద్ద విజయం.. తెలివైన కాకి కథ