సినిమా ఇండస్ట్రీలో చాలా మంది లవ్ ఎఫైర్స్ నడిపిస్తూ ఉంటారు.స్టార్ హీరో హీరోయిన్స్ ప్రేమాయణాలు నిత్యం వార్తల్లో చూస్తే ఉన్నాం.. కొంతమంది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. మరికొంతమంది బ్రేకప్, విడాకులు అంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే స్టార్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం చాలా మందితో ఎఫర్స్ నడిపిస్తూ ఉంటారు. అలాగే రెండు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటుంటారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ఏకంగా ఆరు ఎఫైర్స్ పెట్టుకుంది. అలాగే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. ఇక ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె చాలా ఫెమస్ నటి.. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే..
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఓ స్టార్ నటి.. ఆమె చేయని పాత్రలు లేవు.. తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్ అనేవి బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తూ.. వినిపిస్తూ ఉంటాయి. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా బాలీవుడ్ కు సంబందించిన నటినే.. ఆమె పేరు రేఖ. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటి రేఖ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. సినిమాలకంటే ఆమె తన వ్యక్తిగత కారణాలతో అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
రేఖ గతంలో ఒకసారి తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రేఖ జీవితంలో చాలా విషాదం జరిగింది. పెళ్లయిన 6 నెలలకే రేఖ భర్త ముఖేష్ అగర్వాల్ అనుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో రేఖ పై చాల ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది ఆమెను విమర్శించారు. అలాగే రేఖ గురించి దారుణంగా మాట్లాడారు. ముఖేష్ చనిపోడానికి రేఖ కారణం అంటూ నిందలు వేశారు.. అవమానించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ.. షాకింగ్ విషయం చెప్పింది. ముఖేష్ రేఖ నుంచి విడాకులు కోరుకున్నాడు. రేఖ మాత్రం తన భర్త నుంచి విడాకులు అడగలేదు. పెళ్లయ్యాక భర్త పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేనెప్పుడూ సంబంధాన్ని వదులుకోలేదు’ అని రేఖ చెప్పింది. అలాగే మేం లండన్‌లో హనీమూన్‌కి వెళ్లాం. అయితే ముఖేష్ రిలేషన్‌షిప్‌లో తేడా కనిపించిందని రేఖ తెలిపింది. ఆ తర్వాత రేఖ దివంగత నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకున్నట్లు సమాచారం. కానీ వినోద్ మెహ్రా తల్లి రేఖను కోడలిగా అంగీకరించలేదు. వీరి పెళ్ళికి అంగీకరించపోవడంతో.. వినోద్ మెహ్రా, రేఖ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ ఇద్దరూ తమ వివాహ బంధాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. అప్పటికే ఈ ఇద్దరి గురుంచి చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన కూడా మరణించారు. అయితే రేఖ ఇండస్ట్రీలో చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.
రేఖ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఈరోజు 69 ఏళ్ల వయసులో ఆమె ఒంటరిగా జీవిస్తున్నాడు. 2018 తర్వాత సినిమాల్లో కూడా నటించలేదు. ఆమె ఇంతకుముందు అమితాబ్ బచ్చన్‌ని ప్రేమించినట్లు ప్రచారం కూడా జరిగింది. నవీన్ నిశ్చల్, నటుడు జీతేంద్ర,నటుడు కిరణ్ కుమార్, అమితాబ్ బచ్చన్,రాజ్ బబ్బర్ , సంజయ్ దత్ తోనూ రేఖ ప్రేమాయణం సాగించిందని కూడా వార్తలు వచ్చాయి. రేఖ తన కంటే 13 ఏళ్లు చిన్నవాడైన అక్షయ్ కుమార్‌తో డేటింగ్ ప్రారంభించిందనేది వార్తలు వైరల్ అయ్యాయి. రేఖ జీవితం పై ఓ పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకంలో ఇంకా చాలా మందికి తెలియని రహస్యాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.