Tollywood: వరుసగా 13 ఫ్లాపులు.. క్యాన్సర్‌తో పోరాటం.. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రభాస్, బాలయ్యలతో సినిమాలు.. ఎవరంటే?

ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ లోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడీ స్టార్ యాక్టర్. ఒకానొక దశలో చేసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడ్డాయి. దీనికి తోడు ఒక కేసులో జైలు జీవితం కూడా అనుభవించాల్సి వచ్చింది. ఇక భార్యతో విడాకులు, క్యాన్సర్ మహమ్మారితో పోరాటం ఇలా..

Tollywood: వరుసగా 13 ఫ్లాపులు.. క్యాన్సర్‌తో పోరాటం.. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రభాస్, బాలయ్యలతో సినిమాలు.. ఎవరంటే?
Bollywood Actor

Updated on: Sep 17, 2025 | 8:13 PM

తండ్రి దిగ్గజ నటుడు కావడంతో త్వరగానే సినిమాల్లోకి అడుగు పెట్టాడు. అనతి కాలంలోనే తన నటనతో తనకంటూ ఓప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో స్టార్ హీరో ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. కానీ పగలు తర్వాత రాత్రి ఉన్నట్లే.. ఈ స్టార్ హీరో జీవితంలోనూ కష్టాలు మొదలయ్యాయి. చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. ఒకానొకదశలో వరుసగా 13 ఫ్లాపులు పడ్డాయి. మరోవైపు పోలీసు కేసులు వెంటాడాయి. కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపాడు. ఇక మూడు పెళ్లిళ్లు, విడాకులు.. ఇలా ఈ హీరో జీవితమంతా ఒడిదొడుకులతో సాగింది. అయితే వీటిన్నిటినీ అధిగమించి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకున్నాడు.. కానీ అప్పుడే క్యాన్సర్ మహమ్మారి తగులుకుంది. వైద్య పరీక్షల్లో స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితేనేం అప్పటికే ఎన్నో కఠిన పరిస్థితులను ధైర్యంతో అధిగమించిన ఈ నటుడు క్యాన్సర్ మహమ్మారిని కూడా ఓడించాడు. ఒకప్పుడు హీరోగా అదరగొట్టిన ఈ నటుడు ఇప్పుడు విలన్ గా దుమ్ము రేపుతున్నాడు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, బాలయ్యలతో సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటోన్న ఆ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్.

ఖల్ నాయక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సంజయ్ దత్ 1993లో ముంబై బాంబు పేలుళ్ల కేసులో విచారణను ఎదుర్కొన్నాడు. నిషేధిత ఆయుధాలు ఉన్నాయన్న ఆరోపణలతో జైలు కెళ్లాడు. ఈ కేసు సంజయ్ దత్ ను కొన్నేళ్ల పాటు వెంటాడింది. అయితే ఎట్టకేలకు ఈ కేసులో అతనికి క్లీన్ చిట్ లభించింది. అదే సమయంలో సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నించే క్రమంలో సంజయ్ కు స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అయితే ముంబైలో చికిత్స తీసుకుంటూనే కేజీఎఫ్ 2 షూటింగ్ లో పాల్గొన్నాడు.]

ఇవి కూడా చదవండి

ది రాజా సాబ్ సినిమాలో సంజయ్ దత్..

లియో, డబుల్‌ ఇస్మార్ట్ సినిమాల్లో విలన్ గా అదరగొట్టాడు సంజయ్ దత్. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే బాలకృష్ణ అఖండ 2లోనూ విలన్ గా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .