నవ్వుల రారాజు రాజబాబు తమ్ముళ్లు టాలీవుడ్‌లో తోపు నటులు.. కమెడియన్స్‌గా రాణిస్తున్నారు

టాలీవుడ్‌లో ఎంతో మంది నటీనటులు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వారిలో రాజబాబు ఒకరు. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రాజబాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేస్తారు. స్టార్ హీరోల సినిమాల్లో రాజబాబు పక్కా ఉండాల్సిందే..

నవ్వుల రారాజు రాజబాబు తమ్ముళ్లు టాలీవుడ్‌లో తోపు నటులు.. కమెడియన్స్‌గా రాణిస్తున్నారు
Raja Babu

Updated on: Sep 12, 2025 | 1:12 PM

టాలీవుడ్ లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు. సినిమా ఏదైనా సరే కామెడీ లేకుంటే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా రంజింపలేదు.. రీసెంట్ డేస్ లో హీరోలే కామెడీ చేసి నవ్వులు పూయిస్తున్నారు. సినిమా ఎలాంటిదైనా సరే హీరోలే కామెడీ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పిస్తున్నారు. ఇక ఒకప్పుడు నవ్వుల రారాజుగా పేరు తెచ్చుకున్న కమెడియన్ ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు రాజబాబు. తన కామెడీ టైమింగ్ తో హావభావాలతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించారు. స్టార్ హీరోలు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు. అప్పట్లో రాజబాబు, రమాప్రభ సూపర్ హిట్ కాంబినేషన్..

ఇది కూడా చదవండి : మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు.. యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

అయితే రాజబాబు తమ్ముళ్లు ఇప్పుడు టాలీవుడ్ లో నటులుగా దూసుకుపోతున్నారు. ఆయన ఇద్దరు తమ్ముళ్లు కూడా టాలీవుడ్ లో కెమెడియన్స్ గా రాణిస్తున్నారు. వారు ఎవరో తెలుసా.? మనకు బాగా తెలిసిన నటులే.. కాగా రాజబాబు 1960లో వచ్చిన సమాజం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత 1983లో ఆయన కన్నుమూశారు.

ఇది కూడా చదవండి :మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

రాజాబాబుకు 4 గురు బద్రర్స్, 5 గురు సిస్టర్స్.. రాజబాబు తమ్ముళ్లలో ఇద్దరు టాలీవుడ్ లో కమెడియన్స్ గా రాణించారు. వారి పేరు మరెవరో కాదు చిట్టి బాబు, అనంత్ బాబు.  వారిలో చిట్టి బాబు కమెడియన్ గా మెప్పించారు. పల్లెటూరి బావ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు చిట్టిబాబు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే అనంత్ బాబు.. ఈయన చాలా మందికి తెలిసిన నటుడే..అనంత్ బాబు ఆహా నా పెళ్లంట సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అనంత్ బాబు ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.