Agent Movie: అఖిల్ ఏజెంట్ సినిమాలో మొదట ఆ స్టార్ హీరో నటించాల్సిందా? భారీ డిజాస్టర్ తప్పించుకున్నాడు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చేతులు మారిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలా చేజారిపోయిన సినిమాల్లో కొన్ని హిట్లు కొడితే.. మరికొన్ని డిజాస్టర్‌లు అవుతుంటాయి. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా కూడా మొదట ఓ స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది.. కానీ..

Agent Movie: అఖిల్ ఏజెంట్ సినిమాలో మొదట ఆ స్టార్ హీరో నటించాల్సిందా? భారీ డిజాస్టర్ తప్పించుకున్నాడు
Agent Movie

Updated on: May 10, 2025 | 6:55 PM

అక్కినేని అందగాడు అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మరో కీలక పాత్రలో నటించాడు. సాక్షి వైద్య కథానాయికగా నటించింది. అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించడం, టీజర్లు, ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే 2023 ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా పెద్దగా రాలేదు. ఒళ్లు హూనం చేసుకుని సిక్స్ ప్యాక్ చేసి ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్‌కు తన కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా ఏజెంట్ మూవీ నిలిచిపోయింది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం రూ.20 కోట్ల షేర్ కూడా సాధించలేదు. దీని దెబ్బకు ఈ మూవీ ఓటీటీలోకి రావడానికి సుమారు రెండేళ్లు పైగానే పట్టింది. అప్పుడెప్పుడో 2023లో థియేటర్లలో విడుదలైన ఏజెంట్ సినిమా ఈ ఏడాది మార్చిలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక్కడ కూడా ఆడియెన్స్ ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఏజెంట్ సినిమా కథను ముందుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు చెప్పాడట. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ధ్రువ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో సురేందర్ రెడ్డి మరోసారి ఏజెంట్ కథతో మెగా పవర్ స్టార్ దగ్గరకు వెళ్లాడట. కానీ ఈ కథ రామ్ చరణ్‌కు పెద్దగా నచ్చకపోవడంతో హోల్డ్ లో పెట్టేశాడట. దీంతో సురేందర్ అఖిల్ ను సంప్రదించాడట. అప్పటికీ ఓ మాస్ సినిమా కోసం ఎదురు చూస్తోన్న అక్కినేని హీరో దగ్గరకు ఏజెంట్ కథ రావడంతో వెంటనే ఒకే చెప్పాడట. దీనికి తోడు సురేందర్ ట్రాక్ రికార్డు, స్టైలిష్ టేకింగ్ ను చూసి ఏజెంట్ లో నటించేందుకు అంగీకరించాడట. కానీ అక్కినేని అందగాడి అంచనాలన్నింటినీ ఏజెంట్ మూవీ తలకిందులు చేసింది.

ఇవి కూడా చదవండి

లండన్ లో రామ్ చరణ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .