Balakrishna: రాజశేఖర్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య.. ఏ మూవీనో తెలిస్తే షాక్ అవుతారు

ఇండస్ట్రీలో సినిమాలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో చేయాల్సిన సినిమా వివిధ కారణాలతో మరొకరికి దగ్గరకు వెళ్లడమనేది తరచూ జరుగుతుంటుది. అలా ఒక హీరో చేతుల్లో నుంచి వెళ్లిన సినిమాలతో మరో హిట్ బ్లాక్ బస్టర్ అందుకోవచ్చు లేదా బోల్తా పడవచ్చు.

Balakrishna: రాజశేఖర్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య.. ఏ మూవీనో తెలిస్తే షాక్ అవుతారు
Rajasekhar, Balakrishna

Updated on: Aug 15, 2025 | 9:34 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ, యాంగ్రీ యాంగ్ మ్యాన్ రాజశేఖర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అన్ని రకాల పాత్రలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు బాలయ్య. ఇక రాజశేఖర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరిగా రాణించారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి టాప్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు. ముఖ్యంగా పోలీస్ పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అలాగే యాక్షన్‌ హీరోగానూ పేరుతెచ్చుకున్నారు. అయితే గతంలోలా పెద్దగా సినిమాలు చేయట్లేదు రాజశేఖర్. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ లో ఓ కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం శర్వానంద్ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది.

కాగా రాజశేఖర్‌ కొన్ని ఇండస్ట్రీ సినిమాలను రిజెక్ట్ చేశారట. కాల్షీట్లు లేకపోవడం, సరైన జడ్జ్ మెంట్‌ లేకపోవడమో గానీ మంచి సినిమాలను వదిలేశారట. అందులో జెంటిల్మెన్, మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ తదితర ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయట. అయితే బాలయ్య నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని కూడా రాజశేఖర్ రిజెక్ట్ చేశారట. ఆ సినిమా పేరు లక్ష్మీ నరసింహ. 2000లో రిలీజైన ఈ సినిమాకు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో అదరగొట్టాడు.

అయితే లక్ష్మీ నరసింహ సినిమా కథను ముందుగా రాజశేఖర్ కే చెప్పారట మేకర్స్. కానీ డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లనో ఇతర కారణాల వల్లనో ఆయన పెద్దగా ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో దర్శక నిర్మాతలు వెంటనే బాలయ్యను సంప్రదించారట. కథ విన్న నందమూరి హీరో వెంటనే సినిమాకు ఓకే చెప్పారట. అలా బాలయ్య హీరోగా లక్ష్మీ నరసింహ సినిమా పట్టాలెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాశ్ రాజ్ విలన్ గా నటించాడు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.