Prabhas- Jr NTR: ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్.. ఏ మూవీనో తెలిస్తే షాకవుతారు

ప్రభాస్, ఎన్టీఆర్.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతోన్న టాలీవుడ్ హీరోలు. ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే గతంలో ప్రభాస్ వద్దనుకున్న కథతో ఎన్టీఆర్ ఓ సినిమా తీశాడు.. కట్ చేస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద..

Prabhas- Jr NTR: ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్.. ఏ మూవీనో తెలిస్తే షాకవుతారు
Prabhas, Jr Ntr

Updated on: Oct 22, 2025 | 8:10 PM

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కొత్తగా ఓ సినిమా చేయాలంటే చాలా విషయాలు ఆలోచిస్తారు. కథ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తారు. డైరెక్టర్ చెప్పిన కథ తనకు సూటవుతుందా? ఆడియెన్స్ చూస్తారా? ఇలా చాలా విషయాలను లెక్కలోకి తీసుకుంటారు. అందుకే డైరెక్టర్ చెప్పిన కథలన్నీ హీరోకు నచ్చుతాయనే గ్యారెంటీ లేదు. ఒక వేళ కథ నచ్చినా అందులో నటిస్తాడని కూడా చెప్పలేం. ఇవే కాదు బిజీ షెడ్యూల్, ఇతరత్రా కారణాలతో ఎంతో మంది స్టార్ హీరోలు ఎన్నో సినిమాలను వదులుకున్నారు. అందులో ప్రభాస్ కూడా ఉన్నాడు. బాహుబలితో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు డార్లింగ్. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సలార్, కల్కి 2898 AD వంటి బ్లాక్ బస్టర్స్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో అరడజనకు పైగా సినిమాలున్నాయి. లైన్ లో ఉన్నది అందరూ స్టార్ డైరెక్టర్లే. అయితే వివిధ కారణాలతో గతంలో ప్రభాస్ కూడా చాలా సినిమాలు వదులుకున్నాడు.

నితిన్ దిల్, ఎన్టీఆర్ సింహాద్రి, అల్లు అర్జున్ ఆర్య, రామ్ చరణ్ నాయక్, మహేష్ బాబు ఒక్కడు, రవితేజ కిక్, డాన్ శీను, గోపీచంద్ జిల్ ఇలా చాలా సినిమా కథలు మొదట ప్రభాస్ దగ్గరకే వచ్చాయట. అయితే బిజీ షెడ్యూల్ ఇతరత్రా కారణాలతో ప్రభాస్ వీటిని వదులుకున్నారట. అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు బృందావనం.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ నటించిన మున్నా సినిమాతోనే ఇండస్ట్రీలోకి పరిచయమయ్యాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. తన రెండో సినిమాను కూడా ప్రభాస్ తోనే తీయాలనుకున్నాడట వంశీ. అయితే అప్పటికే తన సినిమా డైరీ ఫుల్ గా ఉండడంతో ప్రభాస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడట. దీంతో తన కథను ఎన్టీఆర్ కు చెప్పారట డైరెక్టర్. స్క్రిప్ట్​ విన్న ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పారట. అలా బృందావనం సినిమా పట్టాలెక్కిందట. ఇందులో సమంత, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..